Watch: రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ.. వీడియో వైరల్‌తో కానిస్టేబుల్స్ సస్పెండ్
Constables Steal iPhone | ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మొబైల్స్ షోరూమ్‌కు వెళ్లారు. ఐఫోన్ మోడల్స్ పరిశీలించారు. అనుమానం రాకుండా పాత ఐఫోన్ వదిలేసి రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ చేశారు. సీసీటీవీ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు.
లక్నో: ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మొబైల్స్ షోరూమ్‌కు వెళ్లారు. ఐఫోన్ మోడల్స్ పరిశీలించారు. అనుమానం రాకుండా పాత ఐఫోన్ వదిలేసి రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ చేశారు. (Constables Steal iPhone) సీసీటీవీ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 7న, శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో లైన్ బజార్ ప్రాంతంలోని జేసీ కూడలి సమీపంలో ఉన్న మొబైల్ షోరూమ్‌కు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్లారు. ఐఫోన్ మోడల్స్ చూపించమని మహిళా సేల్స్‌పర్సన్‌ను అడిగారు. చివరకు ఏదీ నచ్చలేదని చెప్పి బయటకు వెళ్ళిపోయారు.
కాగా, రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ 15 ప్రో మాక్స్ మాయమైనట్లు షాపు యజమాని శివం గుర్తించాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. కానిస్టేబుల్స్‌లో ఒకరు తెలివిగా ఆ ఐఫోన్ తన జేబులో పెట్టుకున్నాడు. చోరీని గుర్తించకుండా ఉండటానికి పాత ఐఫోన్ 13 ప్రో అక్కడ ఉంచి వెళ్లిపోయాడు. ఇది తెలుసుకున్న షాపు యజమాని సీసీటీవీ క్లిప్‌ను తన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. వారిని గుర్తించాలని అతడు కోరగా పోలీసులని తేలింది.
మరోవైపు మొబైల్ షాపు యజమాని శివం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్వయంగా ఎస్పీని కలిసి సీసీటీవీ ఫుటేజ్‌ను అందజేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానిస్టేబుల్స్ ధనంజయ్ బింద్, మిథిలేష్ యాదవ్‌ను నిందితులుగా గుర్తించారు. వారు దొంగిలించిన ఐఫోన్ స్వాధీనం చేసుకుని షాపు యజమానికి అప్పగించారు.
కాగా, ఆ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఆయుష్ శ్రీవాస్తవ ధృవీకరించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్స్ ఐఫోన్ చోరీ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी | जिला जौनपुर में 2 पुलिसकर्मी मोबाइल चुराकर ले गए !!
वे शॉप पर पहुंचे। iPhone देखने लगे। एक iphone डिब्बे से निकालकर लैपटॉप स्क्रीन के पीछे रखा और जेब से अपना पुराना मोबाइल निकालकर उसे बदलकर लड़की को दे दिया।
आरोपी पुलिसकर्मी धनंजय बिंद और मिथिलेश यादव सस्पेंड कर दिए गए… pic.twitter.com/G90cpAWRsw
— Sachin Gupta (@SachinGuptaUP) February 11, 2026
यूपी | जौनपुर के मोबाइल शॉप संचालक शिवम को सुनिए…कैसे उसकी दुकान पर 2 पुलिसकर्मी आए और आईफोन चुराकर ले गए।
शिवम के आंसू नहीं रुक रहे। महीनों की आमदनी एकसाथ चली गई। https://t.co/G9O9uojru2 pic.twitter.com/tj26zki80R
— Sachin Gupta (@SachinGuptaUP) February 11, 2026
Also Read:
Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసు.. బాబా అరెస్ట్
Toxic Fumes | భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమారుడు ఇంట్లో మృతి.. విష వాయువులు కారణమని అనుమానం
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

