Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Student Escapes Death | ఒక విద్యార్థి నడిపిన బైక్ అదుపుతప్పింది. మలుపులో అది జారిపడింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడు రోడ్డుపై పడ్డాడు. ఎదురుగా వస్తున్న బస్సు టైర్ కింద పడబోయాడు. అయితే డ్రైవర్ బ్రేకులు వేయడంతో చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
తిరువనంతపురం: ఒక విద్యార్థి నడిపిన బైక్ అదుపుతప్పింది. మలుపులో అది జారిపడింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడు రోడ్డుపై పడ్డాడు. ఎదురుగా వస్తున్న బస్సు టైర్ కింద పడబోయాడు. అయితే డ్రైవర్ బ్రేకులు వేయడంతో చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Student Escapes Death) కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఒక విద్యార్థి బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు మలుపులో నియంత్రణ కోల్పోయాడు. దీంతో బైక్ జారడంతో ఆ విద్యార్థి రోడ్డుపై పడ్డాడు.
కాగా, ఎదురుగా ఒక బస్సు వస్తున్నది. రోడ్డుపై ఉన్న విద్యార్థి దాని వెనుక చక్రం ముందు పడబోయాడు. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బ్రేకులు వేయడంతో ఆ బస్సు ఆగింది. అయితే బస్సు వెనుక టైర్ ముందు తల ఉన్న ఆ విద్యార్థి తృటిలో మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు.
మరోవైపు గమనించిన స్థానికులు వెంటనే ఆ యువకుడి వద్దకు వచ్చి సహాయం చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఆ విద్యార్థి మృత్యుంజయుడని నెటిజన్లు కొనియాడారు.
മലപ്പുറം കൂട്ടിലങ്ങാടിയിൽ ബൈക്കപകടത്തിൽ അത്ഭുതകരമായ രക്ഷപ്പെട്ട വിദ്യാർത്ഥി pic.twitter.com/YwKRzlZHpQ
— Anil Padmanabhan🇮🇳🕉️🚩 (@anilp68) February 7, 2026
Also Read:
private aircraft crashes | కూలిన ప్రైవేట్ విమానం.. కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు
Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bus stops
- death
- Escapes
- Inches Away
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

