Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు
Tsunami swing Snapped | ఒక మేళాలో స్వింగ్ రైడ్ కూలింది. దానిపై ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చండీగఢ్: ఒక మేళాలో స్వింగ్ రైడ్ కూలింది. దానిపై ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వింగ్ రైడ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Tsunami swing Snapped) హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సూరజ్‌కుండ్‌లో అంతర్జాతీయ క్రాఫ్ట్ ఫెస్టివల్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వినోదం కోసం పలు రైడ్స్, స్టాల్స్ ఏర్పాటు చేశారు.
కాగా, శనివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో 15 మంది వ్యక్తులు సునామీ స్వింగ్ ఎక్కారు. ఆ పెద్ద ఊయల వేగంగా రౌండ్స్ తిరిగింది. ఉన్నట్టుండి ఒకవైపు స్తంభం నుంచి ఆ స్వింగ్ ఊడిపోయింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్, మరి కొందరు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో రెండో స్తంభం నుంచి కూడా స్వింగ్ ఊడింది. సహాయం చేస్తున్న వారిపై అది పడింది. తలకు గాయం కావడంతో పోలీస్ అధికారి జగదీష్ ప్రసాద్ మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో మేళాలో గందరగోళం చెలరేగింది. దీంతో సందర్శకులను ఆ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
హర్యానా సీఎం నయాబ్ సైనీ, ఆ రాష్ట్ర డీజీపీ అజయ్ సింఘాల్ మరణించిన పోలీస్ అధికారి జగదీష్ ప్రసాద్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అయితే స్వింగ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A jhula (amusement swing) collapsed at a fair in Faridabad, k!lling 2 people, including a police inspector, and leaving 12 others injured.
pic.twitter.com/aKalxzjd9z— Ghar Ke Kalesh (@gharkekalesh) February 7, 2026
Also Read:
Woman Accidentally Hangs | రీల్ కోసం మహిళ ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

