లక్నో: హోంవర్క్ చేయకపోవడంతో ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు తన ప్రతాపం చూపాడు. పదేళ్ల బాలుడ్ని బెత్తంతో 150 సార్లు కొట్టాడు. కాళ్లు వాయడంతో ఆ విద్యార్థి బాధతో కుంటుతూ ఇంటికి చేరుకున్నాడు. (Teacher beats Student 150 times) బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఆ టీచర్‌ను స్కూల్ సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్నైల్గంజ్కు చెందిన 10 ఏళ్ల బాలుడు స్థానిక ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి హోంవర్క్ చేయకపోవడంతో ఇంగ్లీష్ టీచర్ ప్రఖర్ సింగ్ ఆగ్రహించాడు. ఆ బాలుడి కాళ్లపై బెత్తంలో 150 సార్లు కొట్టాడు. ఆ తర్వాత ఆ విద్యార్థికి బిస్కెట్ ఇచ్చాడు. తాను కొట్టిన సంగతి ఎవరికీ చెప్పవద్దని, చెబితే ఇంకా కొడతానని బెదిరించాడు.
కాగా, టీచర్ కొట్టిన దెబ్బలకు వాతలు తేలాయి. దీంతో ఆ విద్యార్థి బాధతో కుంటుతూ ఇంటికి చేరుకున్నాడు. కాళ్లపై బెత్తంతో 150 సార్లు కొట్టిన ఆనవాళ్లు చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ బాలుడి తండ్రి వెంటనే స్కూల్‌కు చేరుకుని ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాడు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఆ ప్రైవేట్ స్కూల్ వెంటనే స్పందించింది. ఇంగ్లీష్ టీచర్ ప్రఖర్ సింగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కూడా ఆ టీచర్‌పై కేసు నమోదు చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: టీచర్‌ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్
Woman Accidentally Hangs | రీల్ కోసం మహిళ ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మృతి
entrepreneur jumps from high-rise | ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి.. వ్యాపారవేత్త ఆత్మహత్య