entrepreneur jumps from high-rise | ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి.. వ్యాపారవేత్త ఆత్మహత్య
entrepreneur jumps from high-rise | ఒక వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కాడు. ప్రార్థన చేసిన తర్వాత కిందకు దూకి మరణించాడు. ఆ వ్యాపారవేత్త ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: ఒక వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కాడు. ప్రార్థన చేసిన తర్వాత కిందకు దూకి మరణించాడు. ఆ వ్యాపారవేత్త ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (entrepreneur jumps from high-rise) మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 59 ఏళ్ల సునీల్ మోతీలాల్ సదరంగని, సోలాపూర్‌లో ప్రముఖ ముల్తానీ బేకరీ యజమాని. కొన్నేళ్లుగా ఆయన పూణేలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల సోలాపూర్ తిరిగి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం విజయపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న పనాష్ అపార్ట్‌మెంట్స్‌కు తన కారులో చేరుకున్నాడు. మెట్లు ఎక్కి 17వ అంతస్తుకు వెళ్లాడు. టెర్రస్ అంచున నిల్చొని దేవుడికి ప్రార్థన చేశాడు.
కాగా, సునీల్ మోతీలాల్ తీరును గమనించిన కొందరు వ్యక్తులు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేశారు. దీంతో వారు అక్కడకు వెళ్లి నచ్చజెప్పి ఆయనకు కిందకు తీసుకువచ్చారు. అయితే పదో అంతస్తుకు చేరగానే తన కారు కీ పైన మర్చిపోయినట్లు సునీల్ మోతీలాల్ చెప్పాడు. పరుగున 17వ అంతస్తుకు చేరుకుని అక్కడ నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సునీల్ మోతీలాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆయన ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బిల్డింగ్ పైనుంచి దూకే ముందు సునీల్ మోతీలాల్ దేవుడ్ని ప్రార్థించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सोलापूर (Solapur) येथे एकेकाळी प्रसिद्ध असलेल्या मुलतानी बेकरीचे मालक सुनील सदारंगानी (वय ६०) यांनी इमारतीवरून उडी मारून आयुष्य संपवल्याची दुर्दैवी घटना घडली. आत्महत्येपूर्वीचा व्हिडिओ सोशल मीडियावर व्हायरल झाला आहे. #Solapur #TragicIncident #LocalNews #solapursuicide pic.twitter.com/R38zsTpL3W
— Mahavoice News (@MahaVoiceNews) February 6, 2026
Also Read:
Surat Builder Shoots Self | గన్‌తో కాల్చుకున్న బిల్డర్.. కుమార్తె పెళ్లి రోజు గుండెపోటుతో మృతి
Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

