Andrew Flintoff’ : ఇంగ్లండ్ వెటరన్ ఆండ్రూ ఫ్లింటాఫ్(Andrew Flintoff’) కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తమ దేశానికి చెందిన జూనియర్ టీమ్ ఇంగ్లండ్ లయన్స్(England Lions)కు కోచింగ్ ఇస్తున్న ఈ మాజీ ఆల్‌రౌండర్ తన పదవికి రాజీనామా చేశాడు. రెండేళ్లుగా ఆ జట్టును తీర్చిదిద్దిన ఫ్లింటాఫ్ ఆగస్టు 8, శనివారంతో తన సేవలకు స్వస్తి పలికాడు. ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్‌గా కొనసాగనున్నాడీ దిగ్గజం.
మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలోని ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పేసిన అతడు ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)లోని జట్లలో ఒకటైన సిడ్నీ థండర్స్ హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు.
Andrew Flintoff has left his role as England Lions head coach.
Read more 👇
— England Cricket (@englandcricket) August 7, 2026
‘లయన్స్ కోచ్‌గా వైదొలగాలని దురదృష్టవశాత్తూ నిర్ణయం తీసుకున్నా. దేశంలోని యువ క్రికెటర్లతో సమయం గడపడం, వారికి శిక్షణ ఇచ్చే అవకాశాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. వారిని మరింత ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నా. తదుపరి సిడ్నీ థండర్స్‌కు ప్రధాన కోచ్‌గా సేవలందించేందుకు నేను ఇక వేచి ఉండలేకపోతున్నా’ అని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) వెల్లడించింది. లయన్స్ హెడ్‌కోచ్‌గా 2004 సెప్టెంబర్‌లో ఫ్లింటాఫ్ బాధ్యతలు చేపట్టాడు.
Andrew Flintoff has decided to step down from his head coach role of England Lions team, as he prepares for his time with @ThunderBBL in #BigBash League.
Flintoff: “Unfortunately, I’ve made the decision to step away from my role with the Lions. Not only have I enjoyed my time… pic.twitter.com/Qt7zm8KdmC
— The CricHub (@thecrichub_live) August 7, 2026
ప్రపంచ క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్లలో ఒకడైన ఫ్లింటాఫ్.. 79 టెస్టుల్లో 3,845 రన్స్ కొట్టాడు. 141 వన్డేల్లో 3,394 పరుగులు.. ఏడు టీ20ల్లో 76 రన్స్ సాధించాడు. 2009లో యాషెస్ సిరీస్ అనంతరం టెస్టులకు వీడ్కోలు పలికిన ఫ్లింటాఫ్ 2010 సెప్టెంబర్‌లోనే వన్డేలు, టీ20లకు అల్విదా చెప్పేశాడు. ప్రస్తుతం అతడి కుమారులు రాకీ ఫ్లింటాఫ్, కొరే ఫ్లింటాఫ్ జూనియర్ క్రికెట్లో రాణిస్తున్నారు.