Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Books Porter To Dump Garbage | చెత్తను పడేసేందుకు ఒక మహిళ పోర్టర్‌ను బుక్ చేసింది. ఆ పార్సిల్ చెత్త అని తెలుసుకుని డెలివరీ మ్యాన్ షాక్ అయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
లక్నో: చెత్తను పడేసేందుకు ఒక మహిళ పోర్టర్‌ను బుక్ చేసింది. ఆ పార్సిల్ చెత్త అని తెలుసుకుని డెలివరీ మ్యాన్ షాక్ అయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. (Woman Books Porter To Dump Garbage) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ పోర్టర్ యాప్ ద్వారా పార్సిల్ డెలివరీ బుక్ చేసింది.
కాగా, పార్సిల్ పికప్ మ్యాన్ కరణ్ నిషాద్ ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు. ఆమె అతడికి ఒక బాక్స్ ఇచ్చింది. డబ్బులు ఆన్లైన్లో చెల్లించినట్లు చెప్పింది. ఆ తర్వాత డ్రాప్ లొకేషన్‌కు అతడు చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ మహిళకు ఫోన్ చేశాడు. ఆ పార్సిల్ ఎవరికి ఇవ్వాలని అడిగాడు. ‘ఎవరికీ డెలివరీ చేయవలసిన అవసరం లేదు. దానిని అక్కడ పడేయండి’ అని ఆమె చెప్పింది.
మరోవైపు కరణ్ ఆ బాక్స్ విప్పి చూశాడు. అందులో ఇంటి చెత్త ఉండటంతో అక్కడ పడేసి వెళ్లిపోయాడు. అతడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డెలివరీ సిబ్బందిని చెత్త పారవేసే వారిగా పరిగణిస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నాడు.
అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆన్లైన్లో పెద్ద చర్చకు దారి తీసింది. బాధ్యతారహిత్యం, డెలివరీ ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగంపై కొందరు మండిపడ్డారు. చెత్త బాక్స్‌ను డస్ట్‌బిన్‌లో బదులు రోడ్డు పక్కన కరణ్ పడేయడాన్ని మరికొందరు విమర్శించారు. పర్యావరణ నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో తన చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు.
A woman booked a porter to throw away garbage.
At the drop point, the porter was SHOCKED to see a huge heap of trash 😳
MAN : “Madam, who should I hand the package to?”
WOMAN : “Brother, just throw it there. It’s all garbage” 🤯 pic.twitter.com/wc1wIZNKH4
— News Algebra (@NewsAlgebraIND) February 5, 2026
Also Read:
Man Kills Mother | మానసిక ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. ఆహారం ఆలస్యమైందని తల్లిని హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

