Thieves Lift Old Woman With Cot | వెండి ఆభరణాల చోరీ కోసం.. మంచంతో సహా వృద్ధురాలిని ఎత్తుకెళ్లిన దొంగలు
Thieves Lift Old Woman With Cot | వెండి ధరలు పెరుగడంతో ఇప్పుడు దొంగల దృష్టి దీనిపై పడింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల చోరీ కోసం కొందరు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన ఆమెను మంచంతో సహా ఎత్తుకెళ్లారు.
జైపూర్: వెండి ధరలు పెరుగడంతో ఇప్పుడు దొంగల దృష్టి దీనిపై పడింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల చోరీ కోసం కొందరు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన ఆమెను మంచంతో సహా ఎత్తుకెళ్లారు. (Thieves Lift Old Woman With Cot) రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి కోథియా గ్రామం మాజీ సర్పంచ్ నాథీ దేవి మాలి ఇంట్లో చోరీకి దొంగలు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన నాథీ దేవి అత్త అయిన 90 ఏళ్ల చోటీ దేవి చేతులు, కాళ్లకు 1.5 కేజీల వెండి కంకణాలు, ఆభరణాలు ఉండటాన్ని వారు గమనించారు.
కాగా, ఇంట్లో నిద్రించిన కుటుంబ సభ్యులు బయటకు రాకుండా ఉండేందుకు దొంగలు డోర్‌కు తాళం వేశారు. మంచంపై నిద్రిస్తున్న చోటీ దేవి అరవకుండా ఆమె నోరు మూశారు. మంచంతో సహా ఆ వృద్ధురాలిని సమీపంలోని పొలం వద్దకు మోసుకుని వెళ్లారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. వాటికి ఉన్న వెండి కంకణాలు తొలగించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు అలికిడికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. ఇంటి బయట నిద్రించిన చోటీ దేవి మంచంతో సహా కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. డోర్‌కు తాళం వేసి ఉండటాన్ని గమనించి ఇరుగుపొరుగు వారిని అలెర్ట్ చేశారు. వారు వచ్చి డోర్‌కు ఉన్న తాళం పగులగొట్టారు. అంతా కలిసి చోటీ దేవి కోసం వెతకసాగారు.
అయితే గ్రామస్తులు రావడం చూసిన దొంగలు వృద్ధురాలిని ఆ పొలంలో వదిలేసి పారిపోయారు. అక్కడ కాళ్లు, చేతులు కట్టేసి మంచంపై ఉన్న చోటీ దేవిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: టీచర్‌ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్
Bullet Rider Opens Fire On Bus | ఓవర్ టేక్కు దారి ఇవ్వనందుకు.. బస్సుపై వ్యక్తి కాల్పులు
Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

