Bullet Rider Opens Fire On Bus | ఓవర్ టేక్కు దారి ఇవ్వనందుకు.. బస్సుపై వ్యక్తి కాల్పులు
Bullet Rider Opens Fire On Bus | బుల్లెట్ బైక్ నడిపిన వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ దారి ఇవ్వకపోవడంతో ఆగ్రహించాడు. ఈ వివాదం నేపథ్యంలో గన్ తీసి బస్సుపై కాల్పులు జరిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: బుల్లెట్ బైక్ నడిపిన వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ దారి ఇవ్వకపోవడంతో ఆగ్రహించాడు. ఈ వివాదం నేపథ్యంలో గన్ తీసి బస్సుపై కాల్పులు జరిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bullet Rider Opens Fire On Bus) ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం అయోధ్యలో దహన సంస్కారాల కోసం 68 ఏళ్ల పరశురామ్ ఉపాధ్యాయ మృతదేహాన్ని అతడి కుటుంబం బస్సులో తరలిస్తున్నది.
కాగా, నిర్మాణంలో ఉన్న రింగ్ రోడ్డు సమీపంలో బుల్లెట్ బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ బస్సును ఓటర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ట్రాఫిక్ కారణంగా డ్రైవర్ దారి ఇవ్వలేదు. దీంతో బుల్లెట్ బైక్ నడిపిన వ్యక్తి డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. దేశీయ పిస్టల్ తీసి కదులుతున్న బస్సుపై కాల్పులు జరిపాడు. బస్సు కిటికీ అద్దానికి బుల్లెట్ తగిలింది.
మరోవైపు తనను లక్ష్యంగా ఆ వ్యక్తి కాల్పులు జరిపాడని బస్సు డ్రైవర్ ఆరోపించాడు. బస్సులో ఉన్నవారు ఇది చూసి ఆగ్రహించారు. బస్సు ఆగడంతో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే బుల్లెట్ బైక్పై వారు పారిపోయారు. ఆ బస్సులోని ఒకరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
📍 बस्ती, उत्तर प्रदेश
योगी जी की सख्त कानून व्यवस्था के अंतर्गत एक बदमाश सरेआम बस में बैठी सवारी पर गोली चला देता है।
योगी जी, यह Video असली है। कहीं इसे भी आप Ai से बनी हुई वीडियो बता दें। pic.twitter.com/5xCkOrP558
— AAP (@AamAadmiParty) February 5, 2026
Also Read:
Watch: టీచర్ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్
MRK Panneerselvam | ఉత్తరాదీయులకు హిందీనే తెలుసు.. పానీపూరీ అమ్మేందుకే వస్తారు: తమిళ మంత్రి
Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Basti
- Bullet Rider
- Bus
- Opens Fire
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

