MRK Panneerselvam | ఉత్తరాదీయులకు హిందీనే తెలుసు.. పానీపూరీ అమ్మేందుకే వస్తారు: తమిళ మంత్రి
MRK Panneerselvam | తమిళనాడు మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు హిందీ మాత్రమే తెలుసని అన్నారు. అందుకే వారు పానీపూరీ అమ్మేందుకు తమిళనాడుకు వస్తారని వ్యాఖ్యానించారు.
చెన్నై: తమిళనాడు మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు హిందీ మాత్రమే తెలుసని అన్నారు. అందుకే వారు పానీపూరీ అమ్మేందుకు తమిళనాడుకు వస్తారని వ్యాఖ్యానించారు. తమిళనాడు వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం (MRK Panneerselvam) బుధవారం ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. మరోసారి భాషా వివాదాన్ని ఆయన రాజేశారు.
కాగా, మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది నుంచి వచ్చిన వారు టేబుళ్లు శుభ్రం చేయడానికి తమిళనాడు వస్తున్నారు. వారు కేవలం హిందీ మాత్రమే నేర్చుకున్నందున నిర్మాణ కార్మికులుగా, పానీపూరీ అమ్మేవారిగా ఇక్కడికి వస్తున్నారు. కానీ మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే మనం రెండు భాషల విధానాన్ని అనుసరిస్తున్నాం. దీంతో తమిళం, ఆంగ్లంపై మన వారు దృష్టి సారిస్తున్నారు. వారు విదేశాలకు వెళ్లి అమెరికా, లండన్‌లో కోట్లలో సంపాదించే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు’ అని అన్నారు.
మరోవైపు మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికార డీఎంకే స్పందించింది. చట్టబద్ధమైన ఏ పనిలోనైనా గౌరవం ఉంటుందని ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా తెలిపారు. తాము దానికి వ్యతిరేకం కాదని చెప్పారు. హిందీ మాట్లాడేవారిపై గానీ, వారు చేసే ఉద్యోగాలపై గానీ తమిళనాడుకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అయితే కేంద్రం త్రిభాషా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
Also Read:
Speaker Om Birla | కుట్రతోనే ప్రధాని సీటును కాంగ్రెస్ ఎంపీలు చుట్టుముట్టారు: స్పీకర్ ఓం బిర్లా
6 Boys Gang Rape Girl | బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు బాలురు అరెస్ట్
explosive materials seized | పుచ్చకాయల లోడ్‌లో పేలుడు పదార్థాలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

