Chiranjeevi | ‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు.. ఈ విజయానికి వరుణ్ తేజ్ పూర్తిగా అర్హుడంటూ మెగా ట్వీట్
Chiranjeevi | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ట్వీట్ చేశారు.
Chiranjeevi | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ట్వీట్ చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన కొరియన్ కనకరాజు లో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్గా నటించారు. రాయలసీమ నేపథ్యానికి కొరియన్ ఫాంటసీ, హారర్, కామెడీ అంశాలను జోడిస్తూ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు.
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ముఖ్యంగా కామెడీ ట్రాక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ నటనతో పాటు కమెడియన్ సత్య పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడ విన్నా నవ్వులే నవ్వులు అనే మాట వినిపిస్తోంది. ప్రియమైన వరుణ్ తేజ్… ఈ విజయానికి నిజంగా నువ్వు అర్హుడివి. నీ కష్టం, నిబద్ధతకు తగిన ఫలితం దక్కింది. ఈ గొప్ప విజయాన్ని అందుకున్న చిత్రబృందానికి నా హృదయపూర్వక అభినందనలు. త్వరలోనే ఈ సినిమాను చూస్తాను. ఈ చిత్రం ఇంకా పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు చిరంజీవి ట్వీట్‌ని తెగ షేర్ చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ వరుణ్ కెరీర్‌కు మంచి ఊపునిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సినిమాకు మౌత్ పబ్లిసిటీ బాగా పెరుగుతుండటంతో వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత కూడా సినిమాకు మంచి ఆదరణ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలతో కొరియన్ కనకరాజుకు మరింత బజ్ ఏర్పడింది. ఈ పాజిటివ్ టాక్‌ను కొనసాగిస్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.My heartfelt regards to director @GandhiMerlapaka,… pic.twitter.com/PLCpyB6Wse
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

