Speaker Om Birla | కుట్రతోనే ప్రధాని సీటును కాంగ్రెస్ ఎంపీలు చుట్టుముట్టారు: స్పీకర్ ఓం బిర్లా
Speaker Om Birla | కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు. దీంతో ప్రసంగాన్ని మోదీ రద్దు చేసుకున్నారని అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు. దీంతో ప్రసంగాన్ని మోదీ రద్దు చేసుకున్నారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో బుధవారం ప్రసంగించాల్సి ఉన్నది. అయితే దీనికి ముందు సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు ప్రధాని సీటు ముందు నిల్చొని నిరసన తెలిపారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ వాయిదా పడింది.
కాగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సంఘటనపై సభలో గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు తన చైర్‌ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించవచ్చని తనకు ముందే సమాచారం ఉన్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు ప్రధానమంత్రి సీటు వద్దకు వెళ్లి ఊహించని సంఘటనకు పాల్పడవచ్చని నాకు విశ్వసనీయ సమాచారం అందింది. అలాంటి సంఘటన జరిగి ఉంటే, అది దేశ గౌరవానికి తీవ్ర నష్టం కలిగించి ఉండేది. అందుకే ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని నేను కోరా’ అని అన్నారు.
మరోవైపు రాజకీయ విభేదాలను స్పీకర్ కార్యాలయం వరకు తీసుకురావడం ఈ సభ సంప్రదాయం కాదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభలో బుధవారం జరిగిన సంఘటన పార్లమెంటు చరిత్రలో ఒక మాయని మచ్చ అని అన్నారు.
Also Read:
explosive materials seized | పుచ్చకాయల లోడ్‌లో పేలుడు పదార్థాలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
6 Boys Gang Rape Girl | బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు బాలురు అరెస్ట్
Nurse Shot Dead | ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. నర్సుపై కాల్పులు జరిపి హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Congress MPs
- do
- lok sabha
- Planned
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

