భువనేశ్వర్: ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను ఆరుగురు బాలురు అడ్డుకున్నారు. ఆమెను ఒక చోటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. (6 Boys Gang Rape Girl) బాలిక తండ్రి ఫిర్యాదుతో ఆరుగురు బాలురను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తురైకేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతున్నది.
కాగా, గత ఏడాది డిసెంబర్ 27న ఆ బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నది. ఆరుగురు బాలురు ఆమెను అడ్డుకుని ఒకచోటకు తీసుకెళ్లారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వీడియో రికార్డ్ చేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ బాలికను బెదిరించారు.
మరోవైపు ఆ బాలురు ఇటీవల ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాలిక తండ్రికి ఈ విషయం తెలిసింది. ఫిబ్రవరి 3న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
నిందితులైన ఆరుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియో రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన 17 ఏళ్ల బాలుడ్ని వయోజనుడిగా పరిగణించాలని కోర్టును కోరుతామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Nurse Shot Dead | ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. నర్సుపై కాల్పులు జరిపి హత్య
explosive materials seized | పుచ్చకాయల లోడ్‌లో పేలుడు పదార్థాలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Watch: చిన్నారికి తృటిలో తప్పిన బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్