explosive materials seized | పుచ్చకాయల లోడ్‌లో పేలుడు పదార్థాలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
explosive materials seized | పుచ్చకాయల లోడ్‌తో వెళ్తున్న మినీ లారీలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. పుచ్చకాయలను తొలగించారు. వాటి కింద దాచిన బాక్సుల్లో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తిరువనంతపురం: పుచ్చకాయల లోడ్‌తో వెళ్తున్న మినీ లారీలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. పుచ్చకాయలను తొలగించారు. వాటి కింద దాచిన బాక్సుల్లో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. (explosive materials seized) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన మినీ లారీలో పుచ్చకాయల మాటున పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు కేరళ పోలీసులకు సమాచారం అందింది.
కాగా, ఫిబ్రవరి 3న రాత్రి 9 గంటల సమయంలో వాలాయర్-వడక్కెంచేరి జాతీయ రహదారిలోని పాలక్కాడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమీపంలో ఆ మినీ లారీని పోలీసులు అడ్డుకున్నారు. పుచ్చకాయలను బయటకు తీశారు. వాటి కింద ఉన్న వందకు పైగా పెట్టెల్లో పేలుడు పదార్థాలు ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. లక్షల విలువైన 4,000 జిలెటిన్ స్టిక్స్, 17 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన డ్రైవర్ సెంథిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ పేలుడు పదార్థాలను తమిళనాడులోని సేలం నుంచి కేరళలోని త్రిస్సూర్‌కు తరలిస్తున్నట్లు అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ పేలుడు పదార్థాలు ఎవరి కోసం తరలిస్తున్నారు?, తగిన అనుమతులు ఉన్నాయా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త కోసం వాహనం తనిఖీ సందర్భంగా బాంబ్ స్క్వాడ్‌ను కూడా అక్కడకు రప్పించారు.
#WATCH | Palakkad, Kerala: A large cache of explosives hidden in a watermelon truck was seized by the Palakkad police. pic.twitter.com/jPmfpEDm9o
— ANI (@ANI) February 5, 2026
Also Read:
Nurse Shot Dead | ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. నర్సుపై కాల్పులు జరిపి హత్య
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్‌లో దాచారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

