జాడలేని టైలరింగ్ హబ్స్!
మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూంసీ) పరిధిలో ఏర్పాటు చేయాలనుకున్న టైలరింగ్ హబ్‌ల జాడ కనిపించడం లేదు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. గత పాలకవర్గంలో కొంత కదలక వచ్చినా ఇప్పుడది కనిపించడం లేదు.
- మహిళలకు ఉపాధి కల్పనలో బల్దియా నిర్లక్ష్యం
- గ్రేటర్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుకు నిర్ణయం
- నెలలు గడుస్తున్నా ప్రక్రియ ముందుకు సాగని వైనం
- గిట్టుబాటు కావడం లేదంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్
- పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులు
వరంగల్, ఆగస్టు 6 : మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూంసీ) పరిధిలో ఏర్పాటు చేయాలనుకున్న టైలరింగ్ హబ్‌ల జాడ కనిపించడం లేదు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. గత పాలకవర్గంలో కొంత కదలక వచ్చినా ఇప్పుడది కనిపించడం లేదు. టైలరింగ్ హబ్‌ల ఏర్పాటు భాగంగా అత్యాధునిక కుట్టు మిషన్ల కొనుగోలు కోసం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇప్పుడు గిట్టుబాటు కావడం లేదంటూ చేతులెత్తేశాడు. దీంతో వీటి ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
గ్రేటర్లో నాలుగు..
గ్రేటర్ పరిధిలోని వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్థన్నపేట, పరకాల నియోజవర్గాలకు సంబంధించి నాలుగు టైలరింగ్ హబ్‌లు ఏర్పాటు చేయాలని కార్యాచరణ రూపొందించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలోని కమ్యూనిటీ హాల్స్‌లో వీటిని కొనసాగించాలని నిర్ణయించారు. ఒక్కో టైలరింగ్ హబ్‌లో 20 ఆధునిక కుట్టు మిషన్లతో పాటు పెద్ద టేబుల్, కటింగ్, కాజాలు, బటన్లు కుట్టే మిషన్లు, కుర్చీలు ప్రభుత్వ నిధులతో సమకూర్చనున్నారు. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేతులేత్తేయడంతో ఇప్పటి వరకు సామగ్రి కొనుగోలు చేయకపోవడంతో టైలరింగ్ హబ్‌ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అయితే పాత టెండర్‌ను రద్దు చేసి, కొత్తగా పిలవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
ఉపాధే లక్ష్యంగా..
మెప్మా పర్యవేక్షణలో, ప ట్టణ సమాఖ్యల ఆధ్వర్యంలో టైలరింగ్ హబ్‌లు నిర్వహించేలా బల్దియా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నియోజవర్గంలోని టౌన్ లెవల్ సమాఖ్య ఆధ్వర్యంలో టైలరింగ్ వచ్చిన మహిళా సంఘాల సభ్యులు హబ్‌లో బట్టలు కుట్టుకునే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన టెండర్లు మహిళా సమాఖ్యలకు ఇచ్చి వాటి ద్వారా సంఘాల సభ్యులకు ఉపాధి కల్చించడమే టైలరింగ్ హబ్‌ల లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల యూనిఫాంలు, ఎంజీఎంలోని సిబ్బంది యూనిఫాంలు కుట్టే టెండర్లు ఈ హబ్‌లకు ఇవ్వడం ద్వారా మహిళలకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. దీంతో పాటు టైలరింగ్ హబ్‌లలో మహిళలకు కుట్టు శిక్షణ సైతం ఇవ్వనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

