గువాహతి: మైనర్ బాలిక ఒక ఇంట్లో పనులు చేస్తున్నది. ఆ ఇంటి వారు ఆమెను వేధిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. అయితే ఆ ఇంటి వారు బాలికను బెడ్ బాక్స్‌లో దాచారు. (House Help Girl In Bed Box) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాం రాజధాని గువాహతిలో ఈ సంఘటన జరిగింది. అరీనా లస్కర్ ఖాతున్ ఇంట్లో 13 ఏళ్ల బాలిక పనిమనిషిగా ఉన్నది. ఆ మైనర్ బాలికతో ఆరేళ్లుగా ఇంటి పనులు చేయిస్తున్నారు. ఆమెను చిత్రహింసలకు గురి చేసి శారీరకంగా హింసిస్తున్నారు.
కాగా, స్థానికుల సమాచారంతో బాల కార్మిక వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 1న మేజిస్ట్రేట్ సమక్షంలో జిల్లా కార్మిక అధికారులు, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అయితే తమ ఇంట్లో బాలిక పని చేయడం లేదని, నాలుగు రోజుల కిందటే ఆమెను తండ్రి తీసుకెళ్లినట్లు ఇంటి యజమాని తెలిపారు.
మరోవైపు అధికారులు దీనిని నమ్మలేదు. ఆ ఇంట్లోని అన్ని గదులు, అన్ని చోట్ల వెతికారు. ఒక రూమ్‌లో వ్యక్తి నిద్రిస్తున్న బెడ్‌ను తనిఖీ చేశారు. ఆ బెడ్ బాక్స్‌ను తెరిచి చూడగా లోపల దాచిన బాలిక బయటకు వచ్చింది. సుమారు 25 నిమిషాల పాటు ఆ బెడ్ బాక్స్‌లో ఆమెను దాచినట్లు తెలుసుకున్నారు. మైనర్ బాలికను రక్షించారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా బాల కార్మికులతో ఇంటి పనులు చేయిస్తున్న ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బెడ్ బాక్స్‌లో దాచిన మైనర్ బాలికను రెస్క్యూ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Guwahati horror 13yo girl trafficked into domestic slavery at 7, beaten for 6 yrs, then hidden in a bed box to dodge raid.
What’s 7yr child is capable of doing for herself ?This is gendered violence normalized in our homes. Women & girls as invisible, disposable labour.… pic.twitter.com/q6L1khuh9z
— aree_shuklajii (@th_anonymouse) February 3, 2026
Also Read:
Watch: గుర్రంపై ఊరేగిన దళిత వరుడు.. కత్తులతో దాడికి అగ్రవర్ణాలు యత్నం
Watch: రోడ్డుపై ఘర్షణ.. రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
Watch: చిన్నారికి తృటిలో తప్పిన బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్