భోపాల్: వాహనం రాసుకోవడంతో రోడ్డుపై ఘర్షణ జరిగింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన
రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను కారు బానెట్‌పై డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. గాయపడిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Retired Army soldier On Bonnet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదిత్య పురంలోని గణేష్ కాలనీలో రిటైర్డ్ సైనికుడు కళ్యాణ్ కిషోర్ కాంత్ శర్మ నివసిస్తున్నారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తన బంధువుతో కలిసి బయట డిన్నర్ తర్వాత కారులో ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
కాగా, భిండ్ రోడ్డులోని రద్దీగా ఉండే ఆదిత్య హోటల్ సమీపంలో రిటైర్డ్ జవాన్ కళ్యాణ్ కిషోర్ కాంత్ కారు మరో కారును స్వల్పంగా రాసుకున్నది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆయనను తిట్టారు. గొడవకు దిగడంతోపాటు మాజీ జవాన్, ఆయన బంధువును కొట్టారు.
మరోవైపు ఇది చూసి జనం గుమిగూడారు. దీంతో అక్కడి నుంచి కారులో పారిపోయేందుకు ఆ వ్యక్తులు సిద్ధమవ్వగా అడ్డుకునేందుకు కళ్యాణ్ కిషోర్ కాంత్ ప్రయత్నించారు. కారు ముందు ఆయన నిల్చొని ఉన్నప్పటికీ ముందుకు దూకించారు.
అయితే అదుపుతప్పిన మాజీ జవాన్ ఆ కారు బానెట్‌పై పడ్డారు. దానిని గట్టిగా పట్టుకుని ప్రమాదకరంగా వేలాడారు. అయినప్పటికీ కారును వారు ఆపలేదు. సుమారు కిలోమీటరు దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత సడన్ బ్రేక్ వేయడంతో మాజీ జవాన్ కళ్యాణ్ కిషోర్ కాంత్ రోడ్డుపై పడ్డారు. కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, తీవ్రంగా గాయపడిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కళ్యాణ్ కిషోర్ కాంత్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Retired Army Officer On Bonnet, Man Drives For A Km After Road Rage https://t.co/tHfsBhg1Ju pic.twitter.com/MhJGeRuDHP
— NDTV (@ndtv) February 2, 2026
Also Read:
Momos For Jewellery | రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చి.. మోమోలు తిన్న బాలుడు
Ram’s arrow hits Ravan’s eye | రామ్‌లీలా నాటకంలో.. రావణుడి కంటికి తగిలిన రాముడి బాణం, కేసు నమోదు
Car In Handcuffs | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. కారుకు బేడీలు వేసిన పోలీసులు
wife kills husband | తొమ్మిదేళ్లుగా ప్రేమించింది.. పెళ్లైన రెండు నెలలకే భర్తను చంపింది