భోపాల్: డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి కారు స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత అతడ్ని పంపివేశారు. అయితే పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆ కారుకు బేడీలు వేశారు. (Car In Handcuffs) ఇది చూసి జనం నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. దామోహ్ నాకా ప్రాంతానికి చెందిన ప్రథమ్ కుమార్ మద్యం సేవించి కారు నడిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల తర్వాత ప్రథమ్ కుమార్‌ను వదిలేశారు.
కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న కారును లార్డ్గంజ్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. అయితే ఆ కారుకు బేడీలు వేశారు. బ్యాక్ డోర్ హ్యాండిల్, వెనుక టైర్‌కు కలిపి బేడీలు, గొలుసులు వేశారు. ఆ కారుకు సంకెళ్లు వేయడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎస్పీ స్పందించారు. పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆ కారుకు భద్రతా కారణాల దృష్ట్యా కొంతసేపు బేడీలు వేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బేడీలు తొలగించి గొలుసుతో లాక్ చేసినట్లు చెప్పారు. కారుకు బేడీలు వేసిన సంబంధిత కానిస్టేబుల్ నుంచి వివరణ కోరినట్లు ఆయన వెల్లడించారు.
In a ridiculous development in #MadhyaPradesh’s #Jabalpur, the Lordganj police station, booked a driver under Section 185 (driving under the influence of alcohol) and impounded his vehicle.
Following this the car which the person was driving was taken to the police station and… pic.twitter.com/bKnFBI6Fj7
— Hate Detector 🔍 (@HateDetectors) January 31, 2026
Also Read:
Sunetra Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
Sunetra Pawar | ఎన్సీపీ శాసనసభ పక్ష నాయకురాలిగా సునేత్రా పవార్ ఎన్నిక
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్
Student Murder | ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో వివాదం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య