ముంబై: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా శనివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తున్నది. అజిత్ పవార్ బాబాయ్, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) దీనిపై స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. ఈ అంశంలో ఎవరూ తనను సంప్రదించలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘దాని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఆమె పార్టీనే నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఈ రోజు నేను వార్తాపత్రికలో చూసిన దాని ప్రకారం ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే వంటి కొందరు పేర్లు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వారే చొరవ తీసుకున్నారు. దీనిపై నాతో ఎలాంటి చర్చ జరుగలేదు. దీని గురించి నాకు ఏ సమాచారం లేదు. అసలు ఇది జరుగుతోందో లేదో కూడా నాకు తెలియదు’ అని అన్నారు.
కాగా, ఎన్సీపీ విలీనం ప్రక్రియ నిలిచిపోయినట్లు శరద్ పవార్ స్పష్టం చేశారు. ‘ఇప్పుడు ఆయన కోరికను నెరవేర్చాలని మేం భావిస్తున్నాం. అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్ ఈ రెండు వర్గాల విలీనంపై చర్చలు ప్రారంభించారు. విలీన తేదీ కూడా ఖరారైంది. ఫిబ్రవరి 12న అది జరుగాల్సి ఉన్నది. దురదృష్టవశాత్తు దానికి ముందే అజిత్ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు’ అని అన్నారు.
మరోవైపు 2023 జూలైలో ఎస్పీపీ రెండుగా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా అజిత్ పవార్ నేతృత్వంలో బీజేపీ సారధ్యంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరారు. ఈ చీలిక తర్వాత తన వర్గానికి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్చంద్ర పవార్ అని శరద్ పవార్ పేరు పెట్టారు.
Baramati, Maharashtra: On reports that Sunetra Pawar (wife of Ajit Pawar) will take oath as Deputy CM, NCP (SP) chief Sharad Pawar says, “No. The party must have decided. I think few people have made such decisions, such as Praful Patel and Sunil Tatkare… The party must have… pic.twitter.com/0IZPCR5tsz
— IANS (@ians_india) January 31, 2026
Also Read:
Husband Calls Monkey, Model Suicide | సరదాగా ‘కోతి’ అని పిలిచిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న మోడల్
Watch: మహిళపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి.. తల, ముఖం, మెడకు 50 కుట్లు