లక్నో: ఒక మహిళ మోడలింగ్ చేస్తున్నది. తన అందం పట్ల ఆమె గర్వపడేది. అయితే ఆ మహిళను భర్త ‘కోతి’ అని పిలిచాడు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలుసుకుని ఆ కుటుంబం షాక్ అయ్యింది. (Husband Calls Monkey, Model Suicide) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఇందిరానగర్ ప్రాంతంలో నివసించే తన్నూ సింగ్ మోడల్‌గా రాణిస్తున్నది. తన అందం, మోడలింగ్ కెరీర్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నది.
కాగా, జనవరి 28న సీతాపూర్‌లోని బంధువుల ఇంటికి కుటుంబంతో కలిసి తన్నూ సింగ్ వెళ్లింది. బుధవారం సాయంత్రం వారి ఇంటికి తిరిగి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మాటల సందర్భంగా తన్నూ సింగ్‌ను ‘కోతి’లా ఉన్నావని ఆమె భర్త రాహుల్ సింగ్ సరదాగా అన్నాడు.
మరోవైపు అందరి ముందు తనను ‘కోతి’ అని భర్త పిలువడాన్ని మోడల్ అయిన తన్నూ సింగ్ తట్టుకోలేకపోయింది. వెంటనే ఆ గది నుంచి వెళ్లిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బాధపడినట్లు భావించిన కుటుంబ సభ్యులు వెంటనే జోక్యం చేసుకోలేదు.
అయితే గంట తర్వాత భోజనం కోసం పిలిచారు. తన్నూ ఎంతకీ స్పందించలేదు. బెడ్ రూమ్ తలుపు తెరిచి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో వారు ఆందోళన చెందారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా తన్నూ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తన్నూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సున్నిత మనస్తత్వం వల్ల ఆ మోడల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: జైలులో ఉన్న ప్రియుడ్ని ఆశ్చర్యపరిచిన మహిళ.. అతడ్ని కలిసి రీల్ రికార్డ్
Men Attack Police Vehicle | నేరస్తుడ్ని విడిపించేందుకు.. పోలీస్ వాహనంపై దాడి
Man Kills Leopard | కుమారుడ్ని కాపాడేందుకు.. చిరుతను చంపిన వ్యక్తి
Watch: హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన ఎమ్మెల్యే సోదరుడు.. జరిమానా విధించిన పోలీసులకు బెదిరింపు