MLAs Disqualification | దానం, కడియం భవితవ్యం తేలేది రేపే.. అనర్హత పిటిషన్లపై 10 గంటలకు స్పీకర్ తీర్పు..!
MLAs Disqualification : ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల భవితవ్యం రేపటితో తేలిపోనుంది. వీరిద్దరిపై నమోదైన అనర్హత పిటిషన్ల (MLAs Disqualification)పై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించనున్నారు.
MLAs Disqualification : బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల భవితవ్యం రేపటితో తేలిపోనుంది. వీరిద్దరిపై నమోదైన అనర్హత పిటిషన్ల (MLAs Disqualification)పై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఇద్దరి అనర్హతపై ఆయన తీర్పును ప్రకటించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలుపొందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువడాల్సి ఉంది. బుధవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ తీర్పును బట్టి దానం, కడియం వీరిద్దరి భవితవ్యం నిర్ణయం కానుంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు.
స్టేషన్ ఘన్పూర్ నుంచి కారు గుర్తుతో పోటీచేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే అనర్హత పిటిషనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దాంతో.. అంతకంటే ముందే స్పీకర్ తన తీర్పును వెల్లడించాలని నిర్ణయించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

