KTR Birthday | పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్‌ను ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తండ్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆశ్వీరదించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తండ్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) దంపతులు ఆశ్వీరదించారు. పుట్టినరోజు ( KTR Birthday ) సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి ఇంకా కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.

కాగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా, వారి పైన జరుగుతు న్న నిర్బంధాన్ని నిరసిస్తూ , కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- blessing
- BRS
- KCR
- ktr birthday
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

