Shad Nagar | షాద్‌నగర్‌లో జింక మాంసం పట్టివేత.. 8 మంది వేటగాళ్లు అరెస్ట్
షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద ఎస్ఓటీ పోలీసులు 13 కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది వేటగాళ్లను అరెస్ట్ చేసి రైఫిల్, రెండు కార్లు సీజ్ చేశారు.
Shad Nagar | జింకను వేటాడి మాంసాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు కార్లను పోలీసులు తనిఖీ చేయగా జింక మాంసం బయటపడింది.
వాహనాల్లో మొత్తం 13 కిలోల జింక మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జింకను వేటాడేందుకు ఉపయోగించిన రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని తరలిస్తున్న రెండు కార్లను సీజ్ చేశారు.
అరెస్టు చేసిన ఎనిమిది మందిని తదుపరి చర్యల నిమిత్తం కొత్తూరు పోలీసులకు అప్పగించారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

