Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Scene | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేసిన ఆయన, మూడో చిత్రంగా ‘సీన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా సూర్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది.
Scene | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేసిన ఆయన, మూడో చిత్రంగా ‘సీన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా సూర్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంతో జీతూ మాధవన్ తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా అడుగుపెట్టారు. థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన యాప్ కేటలాగ్‌లో ‘సీన్’ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ సినిమా డిసెంబర్ 4, 2026 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అంతేకాదు, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసే అవకాశం లభించనుంది.
‘సీన్’ చిత్రాన్ని ఫన్ యాక్షన్ డ్రామా, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించారు. ఇందులో సూర్య ప్రధాన పాత్రలో నటించగా, యువ నటుడు నస్లెన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. నజ్రియా ఫహాద్ కీలక సహాయ పాత్రను పోషించారు. యాక్షన్, కామెడీ, క్రైమ్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. 2D ఎంటర్టైన్మెంట్, ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. దర్శకుడిగా జీతూ మాధవన్‌కు తమిళంలో ఇది తొలి చిత్రం కావడం, సూర్య నటించడం వంటి అంశాలు మొదటి నుంచే ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఇక డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘సీన్’కు ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుండటంతో ఇతర ప్రాంతాల ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు ఆదరణ దక్కుతుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

