వల్లంపల్లిలో తాగునీటికి తండ్లాట.. ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన
నారాయణపేట జిల్లా వల్లంపల్లిలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రెండేళ్ల క్రితం నిర్మించిన ట్యాంకును వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఊట్కూర్, సెప్టెంబరు 28 : తాగునీటి కోసం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం వల్లంపల్లి గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. కొద్దిరోజులుగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు సోమవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
గ్రామంలో రెండేళ్ల క్రితం కొత్తగా ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించినప్పటికీ ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో ట్యాంకు నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒకటో వార్డులోని పాత ట్యాంకు నుంచే నీటి సరఫరా కొనసాగుతున్నందున మిగతా ఏడు వార్డులకు తాగునీటి సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు.
బోర్లు ఉన్నా.. కరెంటు కష్టాలు
తాగునీటి అవసరాల కోసం బోరుబావులపై ఆధారపడాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. అయితే తరచూ విద్యుత్ కోతలు ఉండటంతో బోర్ల నుంచి నీటిని తోడుకోవడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు. ఒకవైపు వినియోగంలోకి రాని నీటి ట్యాంకు.. మరోవైపు విద్యుత్ కోతలతో తాగునీటి కోసం నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నాకు దిగుతాం
తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే కొత్త ఓవర్హెడ్ ట్యాంకును వినియోగంలోకి తీసుకువచ్చి అన్ని వార్డులకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

