ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పథకం నమోదు కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి...
చుంచుపల్లి, నవంబర్ 27 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పథకం నమోదు కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు, నామినీ వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నమోదు పూర్తయిన అనంతరం లబ్ధిదారులకు రసీదులు అందజేయడంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ, ఎన్రోల్మెంట్ నంబర్, నామినీ వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు తీసుకోవాలని సూచించారు. రైతు బీమా, నేతన్న బీమా, గీత కార్మికుల బీమా, మత్స్యకారుల బీమా వంటి ఇతర ప్రభుత్వ బీమా పథకాల పరిధిలో ఉన్నవారి వివరాలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. నమోదు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 1,250 రేషన్ కార్డులు ఉండగా, మొదటి రోజు 65 మంది వివరాలను నమోదు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పథకంపై విస్తృత అవగాహన కల్పించి అర్హులందరూ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను తన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిణి, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

