Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగుతోంది. ‘ఆర్య’ నుంచి ‘అలా వైకుంఠపురములో’ వరకు ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పరుగు’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన బన్నీ.. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగుతోంది. ‘ఆర్య’ నుంచి ‘అలా వైకుంఠపురములో’ వరకు ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పరుగు’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన బన్నీ.. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే కొన్ని సినిమాలను తక్కువ సమయంలోనే పూర్తి చేసిన ఆయన, మరికొన్ని ప్రాజెక్టుల కోసం మాత్రం చాలా సమయం కేటాయించారు. ముఖ్యంగా ‘పుష్ప’ సిరీస్ కోసం దాదాపు ఆరేళ్ల సమయం వెచ్చించారు. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో తెరకెక్కిస్తున్న ‘రాకా’ కూడా భారీ స్థాయిలో రూపొందుతోంది.
వరుస సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల తదుపరి ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై తన సినిమాల విషయంలో కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా ప్రారంభించడానికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, ముందుగానే కథలు, దర్శకులు, షూటింగ్ షెడ్యూల్స్‌ను సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారట. దీంతో వీలైనంత తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేస్తూ అభిమానులకు వరుసగా కొత్త చిత్రాలను అందించాలనేది బన్నీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌లతో ఆయన సినిమాలు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.లోకేష్ కనగరాజ్ తనదైన యాక్షన్ కథలు, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, బాసిల్ జోసెఫ్ కూడా తన విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఇద్దరు దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలోనూ నిర్మాణ సమయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ పూర్తి చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలను పట్టాలెక్కిస్తూ తన కెరీర్లో మరింత వేగం పెంచాలని చూస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

