Sonam Wangchuk | అప్పుడు అభిమానం.. ఇప్పుడు విమర్శలు.. మూడేళ్లలో సీన్ రివర్స్..!
Sonam Wangchuk : మూడేళ్ల క్రితం విద్యామంత్రిని అభిమానించిన సోనమ్.. మొదట్లో ప్రధాన్ రాజీనామాకు పట్టుపట్టినా.. చివరకు ఆ డిమాండ్‌ను వదిలేశారు. అయినా సరే ఆయన దీక్షను వృథా కావొద్దని జెన్జీలు, నీట్ బాధితులు మరింత గట్టిగా కొట్లాడుతున్నారు.
Sonam Wangchuk : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేయాలనే డిమాండ్‌పై విద్యార్థిలోకం వెనక్కితగ్గడం లేదు. జంతర్ మంతర్ కేంద్రంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత నిరసనలకు మద్దతునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk ) ఉద్యమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లారు. ఎట్టకేలకు 26 రోజుల ఆమరణ నిరాహార దీక్ష విరమించిన ఆయన.. పార్లమెంట్లో చర్చ, విద్యార్థుల సంక్షేమం వంటి హామీలకు సరేనన్నారు. అయితే.. మూడేళ్ల క్రితం విద్యామంత్రిని అభిమానించిన సోనమ్.. మొదట్లో ప్రధాన్ రాజీనామాకు పట్టుపట్టినా.. చివరకు ఆ డిమాండ్‌ను వదిలేశారు. అయినా సరే ఆయన దీక్షను వృథా కావొద్దని జెన్జీలు, నీట్ బాధితులు మరింత గట్టిగా కొట్లాడుతున్నారు.
మూడేళ్ల కాలంలో.. తనను అభిమానించిన వ్యక్తే తనకు వ్యతిరేకి అవుతాడని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఊహించి ఉండరు. తనను మెచ్చుకున్న మంత్రి రాజీనామా కోసం ఆమరణ దీక్షకు పూనుకుంటానని సోనమ్ వాంగ్‌చుక్ సైతం ఆనుకోని ఉండరు. కానీ, మే 3న జరిగిన నీట్ ప్రశ్నాప్రత్నం లీకేజీ, మే 21న పరీక్ష రద్దు.. తదనంతర పరిణామాలు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థిలోకాన్ని జంతర్ మంతర్ తోవ తొక్కేలా చేశాయి. ఇంకేముంది.. బాధితుల పక్షాన నిలబడి, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక అవ్వాలనుకున్నారు సోనమ్. అంతే.. ఒకప్పుడు ధర్మేంద్ర ప్రధాన్‌ను అభిమానించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆయనకు వ్యతిరకేకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
Three years are a long time in public life. A 2023 photo of education minister #DharmendraPradhan with education reformer #SonamWangchuk and his wife Gitanjali Angmo has acquired a new political life. The March 2023 post, in which Pradhan praised the couple’s ideas and commitment… pic.twitter.com/UmQCb8In3U
— The Times Of India (@timesofindia) July 24, 2026
2023 మార్చిలో
విద్యావ్యస్థలో సంస్కరణలకు పాటుపడుతున్నందుకు సోనమ్, ఆయన భార్య అన్మోగ్ గీతాంజలిని 2023 మార్చిలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ఆ దంపతుల కృషిని ప్రశంసించిన ఆయన వారితో ఫొటో దిగారు. జాతీయ విద్యావిధానం(NEP) – 2020ను గ్రామీణ, కింది స్థాయిలోనూ అములు చేయాలని ఈ సందర్భంగా మంత్రిని సోనమ్ కోరారు కట్ చేస్తే.. మూడేళ్లు గిర్రున తిరిగాయి.

నీట్ లీకేజీకి జవాబుదారీగా ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సోనమ్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు.21 రోజుల జంతర్ మంతర్ వద్ద.. ఆపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో.. అట్నుంచి మేదాంత ఆస్పత్రిలో ఆయన ఫాస్టింగ్ కొనసాగించారు. 26వ రోజున కేంద్ర మంత్రులు జేడీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల హామీతో సోనమ్ తన దీక్షను విరమించారు. దాంతో, మూడేళ్ల క్రితం సోనమ్ దంపతులు ధర్మేంద్ర ప్రధాన్‌తో దిగిన దిగిన ఫొటో ప్రస్తుతం వైరలవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

