రాయ్‌పూర్: జైలులో ఉన్న ప్రియుడిని ప్రియురాలు కలిసింది. ప్రియుడి పుట్టిన రోజున ఆశ్చర్యపరిచింది. అలాగే జైలులో ఉన్న ప్రియుడితో రీల్ రికార్డ్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Surprises Boyfriend In Jail) ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. తర్కేశ్వర్ అనే యువకుడు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో అతడు ఉన్నాడు.
కాగా, తర్కేశ్వర్ పుట్టిన రోజున అతడ్ని ఆశ్చర్యపర్చాలని ప్రియురాలు భావించింది. జైలు అధికారుల అనుమతితో ప్రియుడ్ని కలిసింది. అతడ్ని ఆనందంలో ముంచెత్తింది. అలాగే ఆ జైలులో రీల్ చిత్రీకరించింది. ఆ యువతి భావోద్వేగంతో మాట్లాడింది. ‘ఈ రోజు నా ప్రేమికుడి పుట్టినరోజు. అతడిని కలవడానికి సెంట్రల్ జైలుకు వచ్చా. అతడు నా పక్కన లేడనే బాధ చాలా ఎక్కువగా ఉంది. అతడి పుట్టినరోజున నేను అతనితో లేను. కానీ నేను అతన్ని కలవడానికి వచ్చా. అతడి స్పందన ఎలా ఉందో చూద్దాం’ అని చెప్పింది. ఖైదీల సందర్శన గదిలో ప్రియుడితో మాట్లాడిన తర్వాత రీల్ రికార్డ్ చేసింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్‌ను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఖైదీలను కలిసే సందర్శన గదిలోకి మొబైల్ ఫోన్ అనుమతించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రాయ్‌పూర్ సెంట్రల్ జైలు అధికారులు ఈ వీడియో క్లిప్‌పై ఇంకా స్పందించలేదు.
रायपुर सेंट्रल जेल की कार्यप्रणाली पर सवाल खड़े हो गए हैं। जेल के भीतर से बनाया गया एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। बताया जा रहा है कि जेल में बंद एक आरोपी की प्रेमिका ने मुलाकात के दौरान उसका वीडियो बनाया और सोशल मीडिया पर पोस्ट कर दिया। वीडियो में आरोपी… pic.twitter.com/9ACoOYLoja
— Asian News Bharat (@Asian_newsBH) January 29, 2026
Also Read:
Men Attack Police Vehicle | నేరస్తుడ్ని విడిపించేందుకు.. పోలీస్ వాహనంపై దాడి
Man Kills Leopard | కుమారుడ్ని కాపాడేందుకు.. చిరుతను చంపిన వ్యక్తి
Watch: హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన ఎమ్మెల్యే సోదరుడు.. జరిమానా విధించిన పోలీసులకు బెదిరింపు