TeamIndia | 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భాగంగా నేడు వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో టీమిండియా కీలక పోరుకి సిద్ధమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు ముంబైలోని ప్రముఖ శ్రీ సిద్ధవినాయక ఆలయాన్ని సందర్శించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలోకి కీలక ఆటగాళ్లు దైవదర్శనం చేసుకోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కొత్త ట్రెండ్ ఏంటంటూ విమర్శకులు విరుచుకుపడుతున్నారు.
ముఖ్యంగా మ్యాచ్‌లు గెలవాలంటే మైదానంలో ప్రతిభ చూపాలని, కేవలం దేవలయాలు తిరిగితే ఫలితం ఉండదని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. క్లిష్టమైన మ్యాచ్‌లకు ముందు ఇలా దైవ ప్రార్థనలపై ఆధారపడటం వారి ఆత్మవిశ్వాసం లోపాన్ని సూచిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి సిరీస్‌కు ముందు ఇలా ఫోటోల కోసం గుడులకు వెళ్లడం ఒక ఫ్యాషన్‌గా మారిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ విమర్శలను కొందరూ కొట్టిపారేస్తున్నారు. దైవదర్శనం వల్ల లభించే మనశ్శాంతి ఆటగాళ్లపై సానుకూల ప్రభావం చూపుతుందని, నమ్మకం అనేది వ్యక్తిగత విషయమని వారు వాదిస్తున్నారు. కాగా.. ఈ వివాదం ఎలా ఉన్నా, నేటి సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Indian cricketers should keep in their mind that,matches are won by their collective performance on the field and,not by visiting the temples for seeking the blessings of the https://t.co/Bkgvtt5PzH best wishes to the team ahead of the crucial SF against England…
— Subhash Mahadik (@MahaSubhash) March 4, 2026