దుబాయ్: ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో రెండు టీ20 సిరీస్లు ఓడి ఈ ఫార్మాట్లో అగ్రస్థానాన్ని చేజార్చుకున్న భారత జట్టు.. మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. జింబాబ్వే పర్యటనలో సిరీస్ను గెలుచుకున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సేన మళ్లీ టాప్ ప్లేస్కు చేరింది. బ్యాటర్ల విషయంలో ఇషాన్ కిషన్ (892 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానాన కొనసాగుతుండగా అభిషేక్ శర్మ (858) రెండో స్థానంలో ఉన్నాడు.