సమర్కండ్: చెస్ ఒలింపియాడ్‌లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఓపెన్ కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్లుగా వరుసగా ఐదు విజయాలు సాధించిన భారత్.. ఆరో రౌండ్లో 1.5-2.5తో ఉజ్బెకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రజ్ఞానంద, అర్జున్, గుకేశ్ గేమ్‌లు డ్రాగా ముగియగా నొదిర్బెక్ చేతిలో నిహాల్ ఓడిపోయాడు. కాగా అమ్మాయిల విభాగంలో భారత్ 2-1తో యూఎస్ఏపై గెలిచింది.