భూముల క్రమబద్ధీకరణ పేరిట కాసుల వేట!
పేదల ఆస్తులపై హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన 22ఏ నిషేధిత జాబితా నుంచి ఆస్తులను కాపాడుకోవాలంటే సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా ఉంది. గతంలో ఉన్న కనీస ధరను పరిగణలోకి తీసుకోకుండా కొత్త ధరలతో కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మార్గదర్శకాలను తీసుకొచ్చే పనిలో ఉన్న సర్కార్..
- కనీస ధర పేరుతో మరింత భారం?
- యూఎల్సీ భూములపై సర్కార్ మెలిక
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పేదల ఆస్తులపై హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన 22ఏ నిషేధిత జాబితా నుంచి ఆస్తులను కాపాడుకోవాలంటే సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా ఉంది. గతంలో ఉన్న కనీస ధరను పరిగణలోకి తీసుకోకుండా కొత్త ధరలతో కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మార్గదర్శకాలను తీసుకొచ్చే పనిలో ఉన్న సర్కార్.. పనిలో పనిగా నిషేధిత జాబితాతో ఖజానా నింపుకోవడం మంచిదనే భావనలో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గతంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా తెచ్చిన జీవో నం.118 నిబంధనలను పకనబెట్టినట్లుగా తెలుస్తోంది.
అదేవిధంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) కోసం గతంలో నిర్ధారించిన ధరలను పక్కన పెట్టి… కొత్త స్లాబుల వారీగా సవరణలు చేయనుందని వినిపిస్తున్నది. ప్రభుత్వ ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా ధరల పెంపునకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో జీవో నం.118లోని ఇండ్లు, ఓపెన్ ప్లాట్లకు గజానికి రూ.250 కనీస ధరగా గత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నేటి ప్రభుత్వం ఆ ధరను సవరించి సామాన్యుడి నుంచి డబ్బులు దండుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. మరింత భారం మోపే దిశగా అడుగులు వేస్తుంది. దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు, భూముల హకుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు గత ప్రభుత్వ ధర ఎంతోకొంత ఊరటనిచ్చింది. ఇప్పుడు అదే జీవోను ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలన్న సాకుతో కనీస ధరను భారీగా పెంచాలని సరారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదాయార్జనే ధ్యేయంగా సవరణలు
మారెట్ పరిస్థితుల పేరుతో కనీస ధరను విపరీతంగా పెంచితే, ఆ భారమంతా సామాన్యులు, దిగువ మధ్య తరగతి ప్రజలపైనే పడనుంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిషరిస్తామన్న ప్రభుత్వ మాటలకు, ప్రస్తుతం సాగుతున్న కసరత్తుకు పొంతన కుదరడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజా సంక్షేమం కంటే, ప్రభుత్వ ఖజానా నింపుకోవడమే ప్రాధాన్యంగా ఈ సవరణలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇచ్చిన జీవో ఆధారంగానే ముందుకుపోతామని చెబుతూనే, ధరల పెంపు పేరుతో సామాన్యుల నడ్డి విరిచేలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి, పేదలకు అందుబాటులో ఉండే విధంగా సహేతుకమైన ధరలకే క్రమబద్ధీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. యూఎల్సీ, జీవో నం.118 ఆస్తులకు కనీస ధరలను మరింత తగ్గించాలని, పేదలపై అదనపు ఆర్థిక భారం మోపకుండానే ఆస్తులపై హక్కులను కట్టబెట్టాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సర్కారుకు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | లైంగిక వేధింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ ఎంపీ.. సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

