కేంద్ర బలగాల వాట్సాప్ గ్రూపుల్లో పాక్ గూఢచారులు
కేంద్ర సాయుధ బలగాలు, రక్షణ శాఖ అధికారులు ఉపయోగించే ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లోకి పాకిస్థాన్ గూఢచారులు ప్రవేశించారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. 13 నుంచి 14 గ్రూపుల్లోకి పాకిస్థాన్ గూఢచారులు భారత మొబైల్ నంబర్లను స్పూఫ్ చేసి ప్రవేశించారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాలు, రక్షణ శాఖ అధికారులు ఉపయోగించే ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లోకి పాకిస్థాన్ గూఢచారులు ప్రవేశించారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. 13 నుంచి 14 గ్రూపుల్లోకి పాకిస్థాన్ గూఢచారులు భారత మొబైల్ నంబర్లను స్పూఫ్ చేసి ప్రవేశించారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. భద్రతా బలగాలు వినియోగించే సోషల్ మీడియాలో వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి.
ఆయా గ్రూపుల్లో జరిగే చర్చలు, సమాచారం, డాక్యుమెంట్లను పాకిస్థాన్ గూఢచారులు నిశ్శబ్దంగా గమనిస్తున్నారని నిఘా సంస్థలు తెలిపాయి. గుర్తింపులేని వ్యక్తులను గ్రూపుల నుంచి వెంటనే తొలగించాలని, అధికారిక, రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సిబ్బందిని ఆదేశించాయి. ఇప్పటికే ఒక వాట్సాప్ గ్రూపులో డీఆర్డీవో శాస్తవ్రేత్తనని చెప్పుకుంటూ సోనియా అనే పేరుతో చలామణి అవుతున్న ఓ వ్యక్తికి కీలక సమాచారాన్ని కొందరు అమ్మారని నిఘా సంస్థలు గుర్తించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

