చైనా నుంచి బంగ్లాకు క్షిపణి తయారీ సామగ్రి
చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న ఓ నౌకలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ రసాయనంతో పాటు లక్షలాది ఖాళీ సిమ్ కార్డులను ఇండోనేషియా నేవీ స్వాధీనం చేసుకున్నదని స్థానిక మీడియా తెలిపింది.
- లక్షలాది సిమ్ కార్డులూ స్వాధీనం
ఢాకా: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న ఓ నౌకలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ రసాయనంతో పాటు లక్షలాది ఖాళీ సిమ్ కార్డులను ఇండోనేషియా నేవీ స్వాధీనం చేసుకున్నదని స్థానిక మీడియా తెలిపింది. రాకెట్, క్షిపణి ఇంధనాల తయారీలో వాడే శక్తిమంతమైన దహన ప్రేరక రసాయనమే సోడియం పెర్క్లోరేట్. కోమొరోస్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ స్టార్ లైన్ నౌకను ఈనెల 7న చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. నౌకలోని 36 కంటెయినర్లలో 15 కంటెయినర్లలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ ఉన్నట్టు ప్రకటించారు.
ఇండోనేషియా నేవీ ప్రాంతీయ కమాండ్-1 కమాండర్ రియర్ అడ్మిరల్ డెన్నీ సెప్టియానా తెలిపిన వివరాల ప్రకారం, ఇంధనం నింపుకోవడానికి బెలవాన్ తీర జలాల్లో నౌక లంగరు వేసింది. ఆ సమయంలో ఇండోనేషియా నేవీ గస్తీ నౌక కేఆర్ఐ సిగాలు-857లోని సిబ్బంది అనుమానాస్పద కదలికలను గుర్తించారని ఇండోనేషియా మీడియా సంస్థ వాస్పదా ఐడీ తెలిపింది. కేఆర్ఐ సిగాలు కమాండర్ కోఆర్మాడా-1 ప్రధాన కార్యాలయంతో సమన్వయం చేసుకొని సమగ్ర తనిఖీలకు ఆదేశించారు. 36 కంటెయినర్లను తనిఖీ చేసిన నేవీ సిబ్బందికి 15 కంటెయినర్లలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్, ఖాళీ 4జీ ఎల్టీఈ సిమ్ కార్డులు భారీ మొత్తంలో లభించినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

