వాట్సాప్ వెబ్ లాగౌట్ మరువొద్దు!
వాట్సాప్ వెబ్ ఉపయోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ ఖాతాను లాగిన్ చేసి, పని పూర్తయ్యాక లాగౌట్ కాకుండా వదిలేస్తే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది.
- వాట్సాప్ యూజర్లకు సైబర్ అలర్ట్
న్యూఢిల్లీ: వాట్సాప్ వెబ్ ఉపయోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ ఖాతాను లాగిన్ చేసి, పని పూర్తయ్యాక లాగౌట్ కాకుండా వదిలేస్తే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ)కి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్సీటీఏయూ) మార్గదర్శకాలను జారీ చేసింది. కంప్యూటర్లో కొనసాగుతున్న వాట్సాప్ వెబ్ లాగిన్ సెషన్‌ను దుర్వినియోగం చేసి ఇతరులు తమ ఖాతాలోకి ప్రవేశించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనివల్ల వ్యక్తిగత సందేశాలు, ఫోన్ నంబర్లు, గ్రూప్ సంభాషణలు బయటపడవచ్చని పేర్కొంది. బాధితుల పేరుతో మోసాలు, సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదముందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

