భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా ఇరుజట్లు మంగళవారం ‘సుజూకీ కప్’లో భాగంగా ఏకైక టీ20లో తలపడనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల మధ్య ఇదే తొలి టీ20 కావడం విశేషం.