Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
Ramgopal Varma | ఏ అంశంపైన అయినా తనదైన శైలిలో నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడే ప్రముఖ దర్శకుడు (Noted Director) రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా (Social Media) లో హాట్ టాపిక్ (Hot Topic) గా మారారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్, ఐటీ రంగాలను కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేఆఫ్స్ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 'ది ఏఐ ట్రూత్ బాంబ్ (The AI Truth Bomb)' పేరుతో సంచలన పోస్ట్ పెట్టారు.
Ramgopal Varma : ఏ అంశంపైన అయినా తనదైన శైలిలో నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడే ప్రముఖ దర్శకుడు (Noted Director) రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా (Social Media) లో హాట్ టాపిక్ (Hot Topic) గా మారారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్, ఐటీ రంగాలను కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేఆఫ్స్ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ది ఏఐ ట్రూత్ బాంబ్ (The AI Truth Bomb)’ పేరుతో సంచలన పోస్ట్ పెట్టారు.
ఏఐ తమ ఉద్యోగాలను దోచుకుంటోందని గగ్గోలు పెడుతున్న ఉద్యోగుల తీరును ఎండగడుతూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఏఐ మా ఉద్యోగాలను దొంగిలిస్తోంది’ అంటూ కంపెనీల ఉద్యోగులు గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అసలు నిజం ఏమిటంటే ఉద్యోగులే తమ ఉద్యోగాలను తామే దొంగిలించుకున్నారు అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లోని ఉద్యోగులు రహస్యంగా ఏఐని ఎలా వాడుకుంటున్నారో ఆయన ఉదాహరణలతో సహా వివరించారు.
‘ఒకప్పుడు సొంతంగా కోడ్ రాసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ను క్లాడ్ (Claude) లో పేస్ట్ చేసి, కేవలం 12 సెకన్లలో ఫంక్షన్ పొందుతున్నాడు. అందులో రెండు వేరియబుల్ పేర్లు మార్చి తానే రాసినట్లుగా సబ్మిట్ చేస్తున్నాడు’ అని పేర్కొన్నాడు. ‘క్యాంపెయిన్ ఐడియాల కోసం జీతం తీసుకునే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.. బ్రీఫ్‌ను చాట్‌జీపీటీకి ఇచ్చి, అది ఇచ్చే మూడు ఆప్షన్లలో తక్కువగా తెలిసే దాన్ని ఎంచుకుని సోమవారం నాటి మీటింగ్‌లో “ఇది నా ఐడియా” అని ప్రెజెంట్ చేస్తున్నాడు’ అని రాసుకొచ్చాడు.
‘ఇక లెక్కలు వేసి విశ్లేషణ చేయాల్సిన డేటా అనలిస్ట్.. స్ప్రెడ్‌షీట్‌ను ఏఐలో అప్లోడ్ చేసి లోపాలను గుర్తించమని, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాయమని ఆదేశించి, ఆ అవుట్‌పుట్‌పై తన పేరు వేసి పంపుతున్నాడు’ అని ఆర్జీవీ పేర్కొన్నాడు. లేఅవుట్ల కోసం గంటల తరబడి శ్రమించే డిజైనర్, మిడ్‌జర్నీ (Midjourney) లో 20 ఆప్షన్లు జనరేట్ చేసి, మనిషి చేసినట్లు కనిపించేలా కాస్త మార్పులు చేస్తున్నాడని వెల్లడించాడు. ఇక కస్టమర్ సపోర్ట్ లీడ్ ప్రతి రిప్లైని సానుభూతిగా వినిపించేలా ఏఐ ద్వారా మార్చి పంపుతున్నాడని విమర్శించాడు.
అందరూ తలుపులు వేసుకుని, బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేస్తూ, తమ సొంత మెదడుతోనే పని చేస్తున్నట్లు నటిస్తున్నారని వర్మ ఎద్దేవా చేశారు. ఈ పని అందరూ చేస్తున్నా ఎవరూ ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఈ రహస్య వ్యవహారాన్ని కనిపెట్టడానికి కంపెనీలకు గూఢచారులుగానీ, సీసీ కెమెరాలుగానీ అవసరం లేదని ఆర్జీవీ అన్నారు. సంస్థల ఆర్థిక గణాంకాలు, స్ప్రెడ్షీట్లే అసలు రహస్యాన్ని బయటపెట్టాయని ఆయన విశ్లేషించారు.
అసలు పనిని ఏఐ చేస్తుంటే మనుషులు మాత్రం పేరోల్‌లో ఉండి జీతాలు తీసుకుంటున్నారని వర్మ వ్యాఖ్యానించారు. ఏఐవల్ల అవుట్‌పుట్ పెరిగిందని, నాణ్యత మెరుగుపడిందని, డెడ్‌లైన్స్ వేగంగా పూర్తయ్యాయని, లాభాలు ఆకాశాన్ని తాకాయని అన్నారు. ఎందుకంటే ఏఐ 24 గంటలూ పనిచేస్తుందని, దానికి కాఫీ బ్రేకులు అక్కర్లేదని, జబ్బు చేయదని, ఫిర్యాదులు చేయదని, సహోద్యోగులపై చాడీలు చెప్పదని, జీతాల పెంపు అడగదని, పైసా జీతం లేకుండానే పని చేస్తుందని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించినప్పుడు.. “కంపెనీ క్రూరమైనది, టెక్నాలజీ విలన్, మమ్మల్ని ఏఐతో భర్తీ చేశారు” అంటూ ఉద్యోగులు షాక్ అవ్వడమే అసలైన విడ్డూరమని ఆర్జీవీ అన్నారు. ఏఐ ఎప్పుడూ ఆఫీసులోకి నడుచుకుంటూ వచ్చి మనుషులను బయటకు గెంటేయలేదని, ఉద్యోగులే రహస్యంగా తమ స్థానాన్ని ఏఐకి అప్పగించి, తాము చేయని పనికి జీతాలు తీసుకుంటూ కూర్చుంటున్నారని కుండబద్దలు కొట్టారు.
ఉద్యోగులకు చివరగా కీలక సూచన చేస్తూ.. భవిష్యత్తు అనేది ఏఐ వాడకాన్ని రహస్యంగా ఉంచడంలో లేదని, దాన్ని బహిరంగంగా, అపరాధ భావన లేకుండా, అత్యంత దూకుడుగా ఉపయోగించడంలోనే ఉందని ఆర్జీవీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకేం జరిగినా ఒక కఠినమైన వాస్తవం మాత్రం తథ్యమని, ఏఐని ఉపయోగించే వ్యక్తులే ఏఐని ఉపయోగించని వారి స్థానాలను భర్తీ చేస్తారని అంటూ ఆర్జీవీ తన పోస్టును ముగించారు. అయితే ఆర్జీవీ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

