‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి వర్ధంతిని ఇకపై ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రాణి రుద్రమదేవి 737వ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని...
- చందుపట్ల చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా
– నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
– రుద్రమదేవి మరణ వివరాలు తెలిపే శిలాశాసనానికి ఘన నివాళి
– గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వర్ధంతి సభ
నకిరేకల్, నవంబర్ 27 : కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి వర్ధంతిని ఇకపై ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రాణి రుద్రమదేవి 737వ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాణి రుద్రమదేవి మరణ వివరాలను తెలిపే శిలాశాసనం వద్ద ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాణి రుద్రమదేవి చందుపట్ల గ్రామంలోనే వీరమరణం పొందారనడానికి చారిత్రక ఆనవాళ్లు, రాతి శాసనాలు సజీవ సాక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Vemula Veeresham
సీఎం, సాంస్కృతిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం
వరంగల్ కోట వేదికగా జరిగే కాకతీయ ఉత్సవాలు, ఇతర అధికారిక కార్యక్రమాల తరహాలోనే చందుపట్లలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జరిగేలా చూడాలని గ్రామ సర్పంచ్ కోరిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ అంశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సాంస్కృతిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి చందుపట్ల చరిత్రకు తగిన గుర్తింపు లభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు రాణి రుద్రమదేవి జ్ఞాపకం అందజేసి సన్మానించారు. సర్పంచ్ లతా వెంకటాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మేడవరపు అశోక్ రావు, ఉప సర్పంచ్ మంజుల శ్రీను, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల, గాదగొని కొండయ్య, నరేందర్, వీరార్జునరెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మలీగి రెడ్డి రంగారెడ్డి, యేసు రత్నం, యాస కరుణాకర్ రెడ్డి, వివేకానంద యువజన మండలి అధ్యక్షుడు కొండ కోటేష్, పాలకవర్గ సభ్యులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
RC17 Casting Call | రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా?.. క్యాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్!
‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

