‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ప్రస్తుత వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జంగ కిశోర్ సూచించారు.
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జంగ కిశోర్
చుంచుపల్లి, నవంబర్ 27 : ప్రస్తుత వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జంగ కిశోర్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ఎదురయ్యే నీటి ఎద్దడిని అధిగమించడానికి రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ నీటి కుంటలు) ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బోర్లలో నీటిమట్టం దిగిపోయి మోటార్ల ప్రెషర్ తగ్గే ప్రమాదం ఉన్నందున, బోర్లలోని నీటిని ఈ కుంటల్లో నిల్వ చేసుకొని అవసరమైన సమయంలో ఉద్యాన పంటలకు సాగునీరు అందించుకోవచ్చని తెలిపారు.
ఫామ్ పాండ్స్ ప్రయోజనాలు
- వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకోవచ్చు
- ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను కొంతవరకు అధిగమించవచ్చు
- మామిడి, ఆయిల్‌పామ్, జీడి, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలకు సకాలంలో నీటిని అందించవచ్చు
- పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడంతో పాటు దిగుబడులు తగ్గకుండా చర్యలు తీసుకోవచ్చు
- భూగర్భ జలాలపై ఆధారపడటాన్ని తగ్గించి నీటి సంరక్షణకు దోహదపడవచ్చు.
ప్రభుత్వ రాయితీలు
తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ ద్వారా అర్హులైన రైతులకు ఫామ్ పాండ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీ సదుపాయం కల్పించబడుతోంది.
వ్యక్తిగత విభాగం : 21 మీటర్లు x 21 మీటర్లు x 3 మీటర్ల కొలతలతో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకొని 500 మైక్రాన్ షీట్ పర్చుకున్నట్లయితే రూ. 90,000/- సబ్సిడీ లభిస్తుంది.
కమ్యూనిటీ విభాగం : 5 మంది కంటే ఎక్కువ మంది రైతులు కమ్యూనిటీగా ఏర్పడి 100 మీటర్లు x 100 మీటర్లు x 3 మీటర్ల కొలతలతో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకొని 500 మైక్రాన్ షీట్ పర్చుకున్నట్లయితే రూ. 18,00,000/- సబ్సిడీ అందించబడుతుంది.
ఆసక్తి గల రైతులు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం అలాగే అవసరమైన పత్రాల వివరాల కోసం తమ మండల ఉద్యానవన అధికారిని లేదా జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జంగ కిశోర్ కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
Damarukam | 14 ఏళ్ల నాగార్జున రికార్డుకు ఎసరు.. ‘ఢమరుకం’కి చేరువలో తరుణ్ భాస్కర్, దుల్కర్ సినిమాలు!
Cholesterol | కొలెస్ట్రాల్ సాధారణంగానే ఉన్నా గుండెకు ప్రమాదం తప్పదా? ఈ పరీక్షలు కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

