హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 21: ఛతీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జీరంఘాటి వద్ద 2013 మే 25న జరిగిన పరివర్తన ర్యాలీ కేసులో 10 మంది ఆదివాసీలకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమాయక ఆదివాసీలకు ఉరిశిక్ష విధించడం అనాగరికమని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరణశిక్ష ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఆదివాసీల జీవన హక్కును గౌరవించాలని పేర్కొన్నారు. జల్-జంగల్-జమీన్‌పై హక్కుల కోసం ఆదివాసీలు పోరాడిన చరిత్రను విస్మరించరాదని తెలిపారు. మావోయిస్టు ఉద్యమం పేరుతో దేశవ్యాప్తంగా నమోదైన కేసులను పునఃసమీక్షించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.