భోపాల్: పలు కేసుల్లో నేరస్తుడైన వ్యక్తిని ఇతర రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో అతడ్ని తరలిస్తుండగా ఆ నేరస్తుడి అనుచరులు బైకులపై చుట్టుముట్టారు. అతడ్ని విడిపించేందుకు పోలీసులపై దాడి చేశారు. (Men Attack Police Vehicle) మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బోరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన హీరా సింగ్ బమ్నియాపై పలు కేసులున్నాయి. 2020లో గోవాలో జరిగిన చోరీ కేసుల్లో ఐదేళ్లుగా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు.
కాగా, గోవా పోలీసులు మధ్యప్రదేశ్‌లోని బోరి గ్రామానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం నిందితుడు హీరా సింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్ లాంఛనాల తర్వాత నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌తో పోలీస్ వాహనంలో గోవా తరలిస్తున్నారు.
అయితే కొంతదూరం ప్రయాణించిన తర్వాత హీరా సింగ్ అనుచరులైన సుమారు 20 మంది ముఖాలకు ముసుగులు వేసుకుని బైకులపై పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టారు. ఆ పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. కొడవళ్లు, పదునైన ఆయుధాలతో పోలీసులపై దాడి చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడు తప్పించుకునేందు పోలీస్ వాహనం విండోను ధ్వంసం చేశారు.
మరోవైపు నిందితుడు హీరా సింగ్ తప్పించుకునే ప్రయత్నాన్ని గోవా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక పోలీసులను వెంటనే అప్రమత్తం చేశారు. దీంతో అదనపు పోలీసులు అక్కడకు చేరుకోగా ఆ వ్యక్తులు బైకులపై పారిపోయారు. గోవా ఎస్ఐతోపాటు మరో ఇద్దరు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. గోవా పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read:
Man Kills Leopard | కుమారుడ్ని కాపాడేందుకు.. చిరుతను చంపిన వ్యక్తి
Watch: హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన ఎమ్మెల్యే సోదరుడు.. జరిమానా విధించిన పోలీసులకు బెదిరింపు