UB Group | ‘బీర్ బాటిల్లో చేపపిల్ల ఈత’.. అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చిన బీర్ల కంపెనీ
UB Group | కింగ్‌ఫిషర్ బీర్ బాటిల్ (Kingfisher Beer Bottel) లో చేపపిల్ల ఈదుతున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా బీర్ల కంపెనీ ‘యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (United Breweries)’ స్పందించింది.
UB Group : కింగ్‌ఫిషర్ బీర్ బాటిల్ (Kingfisher Beer Bottel) లో చేపపిల్ల ఈదుతున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా బీర్ల కంపెనీ ‘యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (United Breweries)’ స్పందించింది. మా బీర్ బాటిల్లో చేపపిల్ల ఈదుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోను తాము చూశామని, అది పూర్తిగా తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చింది. ఈ వార్త ప్రజలను తప్పుదారి పట్టించేదిగా, మా బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేదిగా ఉందని పేర్కొన్నది.
మా అన్ని బీర్ల తయారీ యూనిట్లలో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తామని యునైటెడ్ బ్రూవరీస్
తెలిపింది. మా బాటిలింగ్ లైన్లు పూర్తిగా ఆటోమేటెడ్ చేసి ఉంటాయని, సీల్డ్ ఎన్విరాన్మెంట్లో అవి
పనిచేస్తాయని వెల్లడించింది. చట్టం ప్రకారం అత్యున్నతమైన నాణ్యత ప్రమాణాలను తాము అనుసరిస్తామని, అందుకోసం ఉత్పత్తి ప్రతి దశలోనూ పలుమార్లు క్వాలిటీ చెకప్‌లు జరుగుతాయని వెల్లడించింది. ఇంత కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందున మా బీర్లలో చేపపిల్ల రావడం అనేది అసంభవమని తెలిపారు.
తాము ఈ అంశంపై సమీక్ష జరుపుతున్నామని, అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని
యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. అసత్యపు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని తాము మీడియా సంస్థలను,
ప్రజలను అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నది. అత్యున్నతమైన నాణ్యత కలిగిన ఉత్పత్తులను పంపిణీ చేయడానికి, కస్టమర్ల విశ్వాసం పొందడానికి ‘యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్’ కట్టుబడి ఉందని ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

