Fish in Beer | బీర్ తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. బీర్ బాటిల్లో ఓ చేపపిల్ల ఈదుతూ కనిపించింది. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో ఓ వ్యక్తి శుక్రవారం నాడు కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దాన్ని తాగేందుకు మూత ఓపెన్ చేయగానే అందులో చేప పిల్ల కదులుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన కస్టమర్.. వెంటనే షాపు నిర్వాహకుడిని ప్రశ్నించాడు. అయితే అతనితో వైన్ షాపు నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. బీర్లు తాము తయారుచేయమని.. ఏదైనా ఉంటే తయారుచేసిన కంపెనీని అడుక్కోవాలని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో బీర్ బాటిల్లో చేప కదలడాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
బీర్ బాటిల్లో ప్రత్యక్షమైన చేప పిల్ల
హైదరాబాద్ – నాచారం పరిధిలోని మల్లాపూర్ సమీపంలో ఉన్న ఒక వైన్స్ షాపులో కింగ్‌ఫిషర్ బీర్ కొని, అందులో చేప పిల్లను చూసి షాకైన వ్యక్తి pic.twitter.com/LwNrKLTV2u
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026