Nagarjuna | నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’పై ఆసక్తికర అప్డేట్.. మూడు గెటప్స్‌లో కింగ్?
Nagarjuna | టాలీవుడ్లో కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకుండానే మేకర్స్ సైలెంట్‌గా షూటింగ్ కొనసాగిస్తున్నారు.
Nagarjuna | టాలీవుడ్లో కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకుండానే మేకర్స్ సైలెంట్‌గా షూటింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు రా. కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాలో నాగార్జున సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని ఆయన తెలిపారు. గతంలో ఆయన చేసిన శివ, రక్షకుడు, కూలీ నెం.1 చిత్రాల్లో కనిపించినట్లుగా పవర్ఫుల్ స్టైలిష్ అవతారంలో నాగార్జున కనిపిస్తారని చెప్పారు. అంతేకాకుండా కథానుసారం ఈ సినిమాలో నాగార్జున మూడు వేర్వేరు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున తన కెరీర్లో మైలురాయి అయిన 100వ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ను కాకుండా తక్కువ అనుభవం ఉన్న తమిళ దర్శకుడిని ఎంచుకోవడం మొదట అభిమానుల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ విషయంపై దర్శకుడు రా. కార్తీక్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నాగార్జున సార్‌తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. మంచి కథలతో చాలా మంది ఆయనను సంప్రదిస్తున్నారు. 100వ సినిమా కాబట్టి పెద్ద చర్చ జరుగుతోంది. నేను కూడా ఇదే విషయాన్ని సర్‌ను అడిగాను. అప్పుడు ఆయన కథ నచ్చితే సరిపోతుందని చెప్పారు. ఆయన గత 40 ఏళ్లుగా ఇలాగే కొత్త దర్శకులతో పనిచేస్తూ వస్తున్నారు” అని కార్తీక్ తెలిపారు. నాగార్జున గతంలో కూడా వివిధ భాషల దర్శకులతో కలిసి పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా దర్శకుడు మణిరత్నంతో కలిసి చేసిన గీతాంజలి, అలాగే మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌తో చేసిన సినిమాలు ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచాయని చెప్పారు. ఇక ‘కింగ్ 100’ సినిమాలో నాగార్జునకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రముఖ నటి టబు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘నాట్యం’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన సుస్మిత భట్ మరో హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

