Ishan Kishan | ‘కీర్తి ఆజాద్ ఎవరు?.. ఆయన కామెంట్లను ఎవరు పట్టించుకుంటారు’..?
Ishan Kishan : టీ20 ప్రపంచకప్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో దుమ్మరేపిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాటలతోనూ అదుర్స్ అనిపించాడు. మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్(Kirti Azad) కామెంట్‌పై స్పందన కోరగా.. ఈ లెఫ్ట్ హ్యాండర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
Ishan Kishan : టీ20 ప్రపంచకప్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో దుమ్మరేపిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాటలతోనూ అదుర్స్ అనిపించాడు. ఫైనల్లో మెరుపు అర్ధ శతకంతో భారత జట్టు విజయంలో కీలకమైన ఈ పాకెట్ డైనమైట్.. సోమవారం పాట్నా విమానాశ్రయంలో మీడియా కంటపడ్డాడు. వరల్డ్ కప్ విజేతను ఒక్కసారిగా చుట్టుముట్టిన రిపోర్టర్లు.. మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్(Kirti Azad) కామెంట్‌పై స్పందన కోరగా.. ఈ లెఫ్ట్ హ్యాండర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
మార్చి 8 వ తేదీన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు మూడోసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా నుంచి ట్రోఫీ అందుకున్నాక మైదానంలో సంబురాలు చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు.. అనంతరం కప్‌ను హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లారు.
భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని మొదటగా గుడిలోకి తీసుకెళ్లడంపై మాజీ ఆటగాడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) కీర్తి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ గెలుపొందాకట్రోఫీతో కలిసి ఆలయంలోకి వెళ్లినందుకు భారత ఆటగాళ్లు సిగ్గుపడాలి అని ఆజాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఇషాన్ కిషన్ మీడియా ప్రశ్నించింది. అందుకు అతడు ఒక్క ముక్కలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
Journalist 🗣️: Kirti Azad said “Shame on Team India for going to Temple after the WC victory”
Ishan Kishan 🗣️: What?…..Seemore
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 10, 2026
‘కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపై మీరు ఏమంటారు?’ అని ప్రశ్నించగా ఈ లెఫ్ట్ హ్యాండర్ తెలివిగా సమాధానం చెప్పాడు. ‘కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై నేను ఏమని స్పందించాలి. మేము వరల్డ్‌కప్ గెలుపొందాం. ఈ సమయంలో మీరు మంచి ప్రశ్నలు అడుగుతారని నేను ఆశిస్తున్నా. ఇంతకూ కీర్తి ఆజాద్ ఎవరు? ఆజాద్ మాటల్ని ఎవరు పట్టించుకుంటారు?’ అని ఇషాన్ మాజీ ఆటగాడి గాలి తీసేశాడు.
Journalist: Kirti Azad said “Shame on Team India for going to Temple after the WC victory”
Ishan Kishan : “We have won the World Cup, I expect good questions, Who is Kirti Azad, What Kirti Azad says does not matter”
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 10, 2026
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సైతం కీర్తి ఆజాద్ వ్యాఖ్యలను ఖండించాడు. ‘టీమిండియా క్రికెటర్లు వరల్డ్‌కప్ ట్రోఫీని ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని రాజకీయం చేయడం అర్ధరహితం. కీర్తి ఆజాద్ ఒక మాజీ ఆటగాడు. అలాంటి వ్యక్తి విమర్శలు చేస్తాడని నేను ఊహించలేదు. బహుశా ఆయనకు రాజకీయాలే తొలి ప్రాధాన్యం అయినందున.. ఆయన తాను ఒకప్పుడు క్రికెటర్‌ను అనే విషయం మర్చిపోయి ఉంటారు’ అని భజ్జీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో అన్నాడు.
🚨 Harbhajan Singh cooks Kirti Azad 🚨
“It’s absurd to politicise players taking the trophy to a temple. Kirti Azad himself is a former cricketer. I didn’t expect this from him. Maybe politics has taken priority and he’s forgotten he’s a sportsman.” pic.twitter.com/YbNSF6dsXS
— Brutal Truth (@sarkarstix) March 10, 2026
1983లో తొలిసారి వన్డే వరల్డ్‌కప్ గెలుపొందిన కపిల్ దేవ్ బృందంలో ఒకడైన కీర్తి ఆజాద్.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. బెంగాల్‌లోని బర్ధమన్ – దుర్గాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

