తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించనుంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ గతంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఒత్తిడితో స్పీకర్ విడతల వారీగా ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ జరిపారు. నిన్నటితో మొత్తం 10 మంది ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదంటూ అందరికీ క్లీన్చిట్ ఇచ్చారు. ఈ అంశంపై నేడు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది.