వాషింగ్టన్: ఇటీవల నాటో సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) టర్కీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ను హతమారుస్తామని ఇరానియన్లు బెదిరించడంతో ఆయన తన తిరుగు ప్రయాణంలో రహస్యంగా వెళ్లిపోయారు. ఖతార్ బహూకరించిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో టర్కీ చేరుకున్న ట్రంప్.. బెదిరింపుల నేపథ్యంలో తన రిటర్న్ జర్నీలో పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వెళ్తానని ప్రకటించారు. కానీ అంకారాలోని సెన్బోగా విమానాశ్రయంలో మరో స్టంట్ జరిగింది. అందరి కళ్లు గప్పి.. ట్రంప్ మూడవ మిలిటరీ ప్లేన్‌లో వెళ్లారు. చాలా చాకచక్యంగా ఆయన ప్లేన్‌ను మార్చేశారు. తొలుత అందరి ముందు పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఎక్కినట్లు చేశారు.
ఆ విమానం లోపలికి వెళ్లిన అతను.. ఆ తర్వాత ఆ విమానం వెనుక ఉన్న ఓ కేటరింగ్ ట్రక్కులోకి మారారు. ఆ తర్వాత ఆ ఫుడ్ ట్రక్కు.. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-32ఏ విమానం వద్దకు వెళ్లింది. కేటరింగ్ ట్రక్కు నుంచి ట్రంప్ మిలిటరీ విమానంలోకి వెళ్లారు. ఇక కొన్ని నిమిషాల వ్యవధిలో అంకార విమానాశ్రయం నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలు, ఓ మిలిటరీ విమానం లండన్‌కు బయలుదేరాయి. అయితే లండన్‌లో ట్రంప్ మళ్లీ తన పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి మారిపోయారు. మరో వైపు అంకారా ఎయిర్‌పోర్టులో జర్నలిస్టులు మాత్రం ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి ఎక్కేశారు. వాళ్లంతా ట్రంప్‌తోనే ట్రావెల్ చేస్తున్నట్లు భావించారు. బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ మిల్డెన్‌హాల్‌కు తొలుత సీ-32ఏ విమానం చేరుకున్నది.
🚨 WOW! President Trump outsmarted Iranian threats in Turkey by jumping in a CATERING TRUCK to swap planes when the world thought he was on the legacy Air Force One
This is a JAMES BOND-style mission
Per reports, President Trump boarded Air Force One in Turkey, while a Secret… pic.twitter.com/7QrZb7ChLw
— Nick Sortor (@nicksortor) August 11, 2026