భోపాల్: ఎమ్మెల్యే సోదరుడు హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపాడు. చెకింగ్ పాయింట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆయన బైక్ కీ తీసుని చలానా విధించారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే సోదరుడు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు వారిని బెదిరించాడు. తన బైక్‌ను ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేశాడు. (MLA’s Brother Clashes With Cops) మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కరేరా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రమేష్ ఖాతిక్ సోదరుడు భాగ్చంద్ర ఖాతిక్ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడు.
కాగా, గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో నార్వార్ పోలీస్ స్టేషన్ వెలుపల పోలీసులు చెక్‌పాయింట్ ఏర్పాటు చేశారు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఒక టీచర్ బైక్‌తోపాటు బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు భాగ్చంద్ర బైక్‌ను ఆపారు. ఆయన హెల్మెట్ ధరించకపోవడంతో చలానా కట్టాలని అన్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
మరోవైపు ఒక పోలీస్ ఆ బైక్ కీ తీసుకుని పోలీస్ స్టేషన్లోకి వెళ్తుండగా భాగ్చంద్ర గొడవపడ్డాడు. చలానా కట్టబోనని అన్నాడు. ఆ కానిస్టేబుల్‌ను బెదిరించాడు. తన బైక్‌ను ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేశాడు. దీంతో పోలీస్ అధికారులు జోక్యం చేసుకున్నారు. చివరకు హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినందుకు ఆ ఎమ్మెల్యే సోదరుడికి జరిమానా విధించినట్లు పోలీస్ అధికారి ధృవీకరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MP : शिवपुरी में वाहन चैकिंग के दौरान करैरा से BJP विधायक रमेश खटीक के भाई और पुलिसकर्मियों के बीच हुआ विवाद
◆ बिना हेलमेट बाइक चलाने पर रोकने और चालान न देने पर चाबी निकालने पर हुआ विवाद#MadhyaPradesh | Madhya Pradesh | #Shivpuri pic.twitter.com/4L5LcOMW8r
— News24 (@news24tvchannel) January 30, 2026
Also Read:
Sadhvi Prem Baisa | సాధ్వి అనుమానాస్పద మృతి.. సోషల్ మీడియా పోస్ట్‌పై పలు సందేహాలు
Kolkata Fire | గోడౌన్ల అగ్నిప్రమాదం ఘటనలో 21కు చేరిన మృతులు.. 28 మంది మిస్సింగ్
Watch: పెళ్లిలో ముద్దుపెట్టుకోబోయిన వధూవరులు.. తర్వాత ఏం జరిగిందంటే?