Srilanka Cricket | భారత వరల్డ్‌కప్ కోచ్‌ను పట్టేసిన శ్రీలంక.. గెలుపు బాట తొక్కిస్తాడా..!
Srilanka Cricket : పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన శ్రీలంక వన్డే ప్రపంచకప్‌పై గురి పెట్టింది. స్వదేశంలో చెత్త ఆటతో నిరాశపరిచిన లంకను గాడీలో పెట్టేందుకు గ్యారీ కిరెస్టెన్(Gary Kirsten)ను ఆశ్రయించింది ఆ దేశ బోర్డు.
Srilanka Cricket : పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన శ్రీలంక వన్డే ప్రపంచకప్‌పై గురి పెట్టింది. స్వదేశంలో చెత్త ఆటతో నిరాశపరిచిన లంకను గాడీలో పెట్టేందుకు గ్యారీ కిరెస్టెన్(Gary Kirsten)ను ఆశ్రయించింది ఆ దేశ బోర్డు. అనుభవజ్ఞుడైన ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడిని రెండేళ్ల కాలానికి ప్రధాన కోచ్‌గా నియమించింది శ్రీలంక క్రికెట్. సనత్ జయసూర్య (Sanath Jayasuriya) స్థానాన్ని కిర్‌స్టెన్ భర్తీ చేయనున్నాడు. సుదీర్ఘ అనుభవమున్న గ్యారీ ఏప్రిల్ నుంచి లంక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
రెండేళ్ల కిత్రం టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని సొంతగడ్డపై కొనసాగించిన శ్రీలంక సూపర్ 8లోనే ఇంటిదారి పట్టింది. వరల్డ్‌కప్ హీరో, మాజీ ఆటగాడు సనత్ జయసూర్య కోచింగ్‌లో ఏడాది కాలంగా గొప్పగా ఆడిన లంక.. వరల్డ్‌కప్‌లో మాత్రం తేలిపోయింది. స్వదేశంలోనూ చతికిలపడిన లంకకు కోచ్‌గా ఉండలేనని జయసూర్య వైదిలిగాడు. అతడి రాజీనామాతో కొత్త కోచ్ వేటను మొదలెట్టిన శ్రీలంక క్రికెట్ అనుభవజ్ఞుడైన గ్యారీ కిర్‌స్టెన్‌ను తదుపరి కోచ్‌గా నియమించింది. రెండేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి అతడు కోచ్‌గా సేవలందించనున్నాడు.
South African cricket coach Gary Kirsten will begin his stint as the head coach of the Sri Lanka men’s national cricket team from 15 April 2026#SriLankaCricket #GaryKirsten #Insidesport #CricketTwitter pic.twitter.com/munFbA0hmF
— InsideSport (@InsideSportIND) March 9, 2026
కోచ్‌గా ఘనతలు..
ఆటగాడిగా విజయవంతమైన కిర్‌స్టెన్ కోచ్‌గానూ గొప్పగా రాణించాడు. 2011లో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్ విజయంతో కీలకమైన గ్యారీ.. ఆపై ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టును అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలిపాడు. అనంతరం పాకిస్థాన్ జట్టుకు కొన్నిరోజులు కోచ్‌గా సేవలందించిన అతడు.. పొట్టి వరల్డ్‌కప్‌లో నమీబియా జట్టుకు కన్సల్టెంట్‌గా పని చేశాడు. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ పోటీలకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా101 టెస్టులు, 185 వన్డేల్లో దక్షిణాఫ్రికాకు కిర్‌స్టెన్ ప్రాతినిధ్యం వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

